సుడిగాలి సుధీర్ ఆస్తి అన్ని కోట్లా… చాలా హాట్ కేకే..

జ‌బ‌ర్ద‌స్త్ షో ఎంతో మంది క‌మెడియ‌న్ల‌కు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. వీరంద‌రిలోకి జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా సూప‌ర్ పాపుల‌ర్ అవ్వడంతో పాటు ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది మాత్రం సుడిగాలి సుధీర్. సుడిగాలి సుధీర్ – ర‌ష్మీ జంట బుల్లితెర మీద క‌నిపిస్తే తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కులు ఎంత‌లా మెస్మ‌రేజ్ అవుతారో తెలిసిందే. ఈ షోతో వ‌చ్చిన పాపులారిటీతోనే సుధీర్ సినిమా హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు.

 

 

సుధీర్ హీరోగా మారి సాఫ్ట్‌వేర్ సుధీర్ అనే సినిమా చేశాడు. ఆ సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉన్నా సుధీర్ ఆ స్థాయికి చేర‌డం వెన‌క ఖ‌చ్చితంగా జ‌బ‌ర్ద‌స్త్ షోనే అని చెప్పాలి. జబర్దస్త్ కు వచ్చిన తర్వాత అతని లైఫ్ మారిపోయింది. ఇప్పుడు సుధీర్ డేట్స్ పెద్ద హాట్ కేకులా మారిపోయాయి. రెమ్యున‌రేష‌న్ కూడా డిమాండ్ చేసే స్థాయిలో ఉంది. ప్ర‌స్తుతం సుడిగాలి సుధీర్ ఆస్తులు రు. 4 – 5 కోట్ల మ‌ధ్య‌లో ఉన్నాయ‌ట‌.

అయితే సుధీర్ కెరీర్ ప‌రంగా ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉండ‌డంతో మ‌నోడు మ‌రింత ఆస్తి కూడ‌బెట్టుకోవ‌డం ఖాయం. యేడాదికి సుధీర్ రు. 50 ల‌క్ష‌ల‌కు పైనే సంపాదిస్తున్నాడు. క‌రోనా లేక‌పోయి ఉంటే సుధీర్ దూకుడుకు ప‌గ్గాలే ఉండేవి కావు. ఇక జ‌బ‌ర్ద‌స్త్ షోతో పాటు ఢీ ఛాంపియ‌న్స్‌, పోవే పోరా లంటి ఈవెంట్స్‌తో పాటు సినిమాలు కూడా చేస్తుండ‌డం సుధీర్‌కు చాలా ప్ల‌స్ అవుతోంది.