Moviesసీక్రెట్ పెళ్లితో షాక్ ఇచ్చిన విద్యుల్లేఖ‌.. భ‌లే ట్విస్ట్ ఇచ్చిందే

సీక్రెట్ పెళ్లితో షాక్ ఇచ్చిన విద్యుల్లేఖ‌.. భ‌లే ట్విస్ట్ ఇచ్చిందే

తమిళ నటి విద్యుల్లేఖ తెలుగు వారికి బాగా సుపరిచితం. ఆమె ఆహార్యం, డైలాగ్ డెలివ‌రీ, బాడీ లాంగ్వేజ్‌తో ఇక్కడ ప్రేక్ష‌కుల‌ను క‌ట్టి ప‌డేసింది. ఆమె స్వ‌త‌హాగా త‌మిళ్ అయినా తెలుగులోనే ఎక్కువ ఫేమ‌స్ అయ్యింది. గ‌త రెండు మూడేళ్లుగా క‌మెడియ‌న్‌గా బాగా పాపుల‌ర్ అవుతోన్న విద్యుల్లేఖ సరైనోడు, రాజుగారి గది సహా పలు సినిమాల్లో చేసిన న‌ట‌న‌కు మంచి పేరు వ‌చ్చింది. లాక్‌డౌన్ వేళ అంద‌రూ సినిమా స్టార్లు సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంటోన్న టైంలో ఆమె కూడా సీక్రెట్ పెళ్లి వార్త‌తో స‌డెన్ షాక్ ఇచ్చింది.

ఆగస్టు 26న తనకు నిశ్చితార్థమైందని.. తన జిమ్ ట్రైనర్ సంజయ్ ని ప్రేమించి పెళ్లాడుతున్నానని ప్రకటించ‌డంతో అంద‌రూ షాక్ అయ్యాయి. ఇక ఇటీవ‌ల వైర‌ల్ అయిన ఫొటోలు అన్ని ఆమె ఎంగేజ్‌మెంట్ నాటివే. గ‌త కొంత కాలంగా ఆమె బ‌రువు త‌గ్గించుకునేందుకు తీవ్రంగా క‌స‌ర‌త్తులు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే జిమ్‌కు వెళ్లి బాగా క‌ష్ట‌ప‌డి స్లిమ్ అయ్యింది. ఈ క్రమంలోనే జిమ్ కోచ్ తోనే ప్రేమలో పడిందట.

ఇక వీరి ఎంగేజ్మెంట్ జ‌ర‌గగా.. వీరి వివాహం నవంబ‌ర్‌లో జ‌రుగుతుంద‌ని విద్యుల్లేఖ ప్ర‌క‌టించింది. ఏదేమైనా చాలా బ‌రువుగా ఉన్నా.. స‌న్నాజాజి తీగ‌లా మారి మొత్తానికి త‌న ట్రైన‌ర్‌నే పెళ్లి చేసుకుంటోంది. విద్యుల్లేఖ సీనియర్ తమిళ టెలివిజన్ నటుడైన మోహన్ రామన్ కుమార్తె అన్న సంగతి తెలిసిందే

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news