Moviesపెళ్ల‌యిన మూడు నెల‌ల‌కే విడాకులు తీసుకున్న సునీల్ హీరోయిన్‌... కార‌ణం అదే...!

పెళ్ల‌యిన మూడు నెల‌ల‌కే విడాకులు తీసుకున్న సునీల్ హీరోయిన్‌… కార‌ణం అదే…!

మ‌రో సెల‌బ్రిటీ క‌పుల్ విడిపోయింది. గ‌తేడాది ప్రేమ వివాహం చేసుకున్న హీరోయిన్ ఎస్తేర్‌, సింగ‌ర్ నోయ‌ల్ దంప‌తులు విడాకులు తీసుకున్నారు. ఈ విష‌యాన్ని హీరోయిన్ ఎస్తేర్ చెప్పింది. ఇక గ‌త జ‌న‌వ‌రి 3న  జ‌రిగిన ఈ పెళ్లికి ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి కూడా హాజ‌ర‌య్యాడు. ఆ త‌ర్వాత ఈ జంట కొద్ది రోజులు కూడా కాపురం చేయ‌లేద‌ట‌. పెళ్ల‌యిన రెండో రోజు నుంచే త‌మ మ‌ధ్య చిన్న చిన్న స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంతో తాము కొన్ని రోజులు కూడా కాపురం చేయ‌లేద‌ని ఎస్తేర్ చెప్పింది.

ఇక గ‌త జూన్‌లోనే ప‌ర‌స్ప‌ర అంగీకారంతో తాము విడిపోవాల‌నుకున్నామ‌ని… ఇక ఇప్పుడు అధికారికంగా విడిపోయామ‌ని ఎస్తేర్ చెప్పింది. కోర్టు కూడా వీరికి విడాకులు ఇస్తూ తీర్పు చెప్పింది. ఎస్తేర్ చివ‌ర‌గా తాను చాలా విష‌యాల్లో నిజాయితీగా ఉంటాన‌ని చెప్పింది. ఇంత‌కంటే తాను ఎక్కువ స్పందించ‌న‌న‌డం కొస‌మెరుపు. వీరిమ‌ధ్య స‌ర్దుబాటు స‌మ‌స్య‌లు రావ‌డంతో ఒక అంగీకారానికి రాక త్వ‌ర‌గానే విడిపోయార‌ని తెలుస్తోంది.

1000 అబద్ధాలు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది ఎస్తేర్. ఆ తర్వాత సునీల్ సరసన భీమవరం బుల్లోడు అనే సినిమా చేసింది. చాలా గ్యాప్ తర్వాత జయజానకి నాయక సినిమాలో మెరిసింది. ప్రస్తుతం ఈమె చేతిలో హిందీ, మరాఠి, తమిళ సినిమాలున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news