Moviesఆ స్టార్ హీరోలు డ్ర‌గ్ బానిస‌లు... పేర్ల‌తో స‌హా బాంబు పేల్చిన...

ఆ స్టార్ హీరోలు డ్ర‌గ్ బానిస‌లు… పేర్ల‌తో స‌హా బాంబు పేల్చిన కంగ‌నా

బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ కొద్ది రోజులుగా ఏదో ఒక సంచ‌ల‌నంతో వార్త‌ల్లో ఉంటున్నారు. ముఖ్యంగా దివంగ‌త న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత అత‌డిది ఆత్మ‌హ‌త్య కాద‌ని.. హ‌త్య అంటూ ఆమె సోష‌ల్ మీడియ వేదిక‌గా తీవ్ర‌స్థాయిలో దుమ్మెత్తి పోస్తోంది. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్లో ఉన్న నెపోటిజంపై ఆమె ఓ ఆటాడుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోల‌తో పాటు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం, ఇటు క‌ర‌ణ్ జోహార్‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శలు గుప్పించిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో కంగ‌నా మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలిచింది. రణవీర్ సింగ్, రణబీర్ కపూర్ అయాన్ ముఖర్జీ, విక్కీ కౌశిక్ కొకైన్ డ్రగ్ కు బానిసలయ్యారనే ఆరోపణలు వస్తున్నాయని ఆమె చెప్పారు. ఈ క్ర‌మంలోనే వీరు త‌మ ర‌క్త న‌మూనాలు ఇచ్చి డ్ర‌గ్ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ఆమె సూచించింది. మిమ్మ‌ల‌ను అభిమానించే కోట్లాది మంది అభిమ‌నుల‌కు మీరు ఆద‌ర్శంగా ఉండాలని కూడా కంగ‌నా ట్వీట్ చేసింది.

అంత‌టితో ఆగ‌ని కంగ‌న త‌న ట్వీట్ ప్ర‌ధాని మోదీకి కూడా ట్వీట్ చేసింది. ఇక కంగ‌న కొద్ది రోజులుగా మాహారాష్ట్ర ప్ర‌భుత్వంతో పాటు బాలీవుడ్ ప్ర‌ముఖుల‌పై డేరింగ్‌గా ట్వీట్ చేస్తోంది. కంగ‌న‌కు బీజేపీ స‌పోర్ట్ పుల్లుగా ఉంద‌ని… అందుకే ఆమె త‌న తాజా ట్వీట్ సైతం మోదీకి ట్యాగ్ చేయ‌డాన్ని బ‌ట్టి చూస్తే ఆమెకు కేంద్రంలో బీజేపీ పెద్ద‌ల అండ‌దండ‌లు కూడా ఉన్నాయ‌న్న చ‌ర్చ‌లు బీ టౌన్‌లో వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news