Moviesమ‌హేష్‌, ప‌వ‌న్ ఫ్యాన్స్‌ను టార్గెట్ చేస్తోన్న ప్ర‌భాస్ ఫ్యాన్స్‌...

మ‌హేష్‌, ప‌వ‌న్ ఫ్యాన్స్‌ను టార్గెట్ చేస్తోన్న ప్ర‌భాస్ ఫ్యాన్స్‌…

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో స్టార్ హీరోల సినిమాల‌కు వ‌స్తోన్న లైకులు, వ్యూస్‌, వారికి ఉన్న ఫాలోయింగ్ ఆధారంగానే వారి రేంజ్ ఏంట‌నేది కాలిక్యులేట్ చేస్తోన్న ప‌రిస్థితి. తెలుగు సినిమా అభిమానులు ప్ర‌తిదానికి సోష‌ల్ మీడియా హ్యాష్ ట్యాగ్‌ల‌తో స‌మాధానాలు ఇస్తున్నారు. ఇటీవల సూప‌ర్‌స్టార్‌ మహేష్ పుట్టినరోజున రికార్డు సృష్టించారు ప్రిన్స్ ఫ్యాన్స్‌. ఆ వెంట‌నే ప‌వ‌న్ క‌ళ్యాన్ ఫ్యాన్స్ అయితే త‌మ ఫేవ‌రెట్ హీరో పుట్టిన రోజు సంద‌ర్భంగా ఏకంగా 6.5 కోట్ల (65 మిలియన్ల) సార్లు హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేసి మ‌హేష్ ఫ్యాన్స్ క్రియేట్ చేసిన రికార్డును బ‌ద్ద‌లు కొట్టారు.

ఇక ఇప్పుడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఫ్యాన్స్ వంతు వ‌చ్చేసింది. ప్ర‌భాస్ వీరాభిమానులు మ‌హేష్‌, ప‌వ‌న్ ఫ్యాన్స్ క్రియేట్ చేసిన రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టి స‌రికొత్త రికార్డు క్రియేట్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. ప్రభాస్ తన 41 వ పుట్టినరోజును అక్టోబర్ 23 న జరుపుకోనున్నారు. ఈ పుట్టిన రోజుకు మ‌రో 41 రోజుల టైం ఉంది. ప్రభాస్ అభిమానులు నిన్న సాయంత్రం 6 గంటలకు # 41DaysToREBELSTARBDay అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ చేయ‌డం ప్రారంభించాడు. ఇప్ప‌టికే ఇది ట్విట్ట‌ర్లో 50 లక్షల (5 మిలియన్) సార్లు ట్రెండ్ అయ్యింది.

మ‌రి మ‌హేష్‌, ప‌వ‌న్ ఫ్యాన్స్‌ను టార్గెట్ చేసిన ప్ర‌భాస్ అభిమానులు ఈ విష‌యంలో స‌క్సెస్ అవుతారో ?  లేదో ?  చూడాలి. ఈ క్ర‌మంలోనే సినిమా రికార్డులు, వ‌సూళ్ల‌తో కాకుండా ఇలా సోష‌ల్ మీడియా ట్రెండింగుల‌తో స్టార్‌డ‌మ్ అంచ‌నా వేయ‌డం ఎంత వ‌ర‌కు క‌ర‌క్ట్ అన్న‌ది కూడా చెప్ప‌లేం.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news