Moviesవైర‌ల్‌గా సుశాంత్ - రియా డ్ర‌గ్స్ తీసుకుంటోన్న‌ వీడియో

వైర‌ల్‌గా సుశాంత్ – రియా డ్ర‌గ్స్ తీసుకుంటోన్న‌ వీడియో

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య కేసులో అత‌డి ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తి అనేక ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రియాపై ఈడీ మ‌నీ లాండ‌రింగ్ చ‌ట్టం కింద కేసు కూడా న‌మోదు చేసింది. అనూహ్యంగా సుశాంత్ కేసులో డ్ర‌గ్స్ ఉదంతం బ‌య‌ట‌కు వ‌చ్చింది. రియా డ్ర‌గ్స్ వాడిన‌ట్టు, డ్ర‌గ్ డీల‌ర్ల‌తో ఆమెకు లింకులు ఉన్న‌ట్టు ఆధారాలు కూడా ల‌భించాయి. ఇక సుశాంత్ కూడా డ్ర‌గ్స్ తీసుకునేవాడ‌న్న సందేహాలు క‌లిగాయి.

 

ఇదిలా ఉండగా సుశాంత్ సింగ్, రియా చక్రవర్తి ఇద్దరూ క‌లిసి డ్ర‌గ్ తీసుకుంటోన్న వీడియో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఓ పార్టీలో వీరిద్ద‌రు ఎంజాయ్ చేస్తూ డ్ర‌గ్ తీసుకుంటున్న‌ట్టుగా ఈ వీడియోలో ఉంది. సుశాంత్‌, రియా క‌లిసి ఒకే డ్ర‌గ్ షేర్ చేసుకుంటున్న‌ట్టుగా కూడా ఉంది. అయితే ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌డంతో రియానే సుశాంత్ కి డ్రగ్స్ అలవాటు చేసిందని అతని సపోర్టర్స్ కామెంట్లు పెడుతున్నారు.

 

ఇక సుశాంత్ మాజీ ప్రియురాలు అంకితా లోఖాండే మాత్రం సుశాంత్ డిప్రెష‌న్‌లో ఉన్నాడ‌ని తెలిసి కూడా రియా అత‌డికి డ్ర‌గ్స్ ఇచ్చింద‌ని.. అప్పుడే రియా కూడా డ్ర‌గ్స్ తీసుకుంద‌ని చెప్పింది. ఏదేమైనా సుశాంత్ రియా ఇద్దరూ డ్రగ్స్ సేవించారని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు చెబుతున్నారు.

 

https://www.instagram.com/p/CE-utb-ggoH/

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news