Gossipsమ‌హేష్ డైరెక్ట‌ర్‌తో మెగాప‌వ‌ర్ స్టార్‌

మ‌హేష్ డైరెక్ట‌ర్‌తో మెగాప‌వ‌ర్ స్టార్‌

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుతో చేయాల్సిన సినిమా మిస్ అవ్వ‌డంతో ఇప్పుడు అదే డైరెక్ట‌ర్ మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో ఆ ఛాన్స్ ఒడిసి ప‌ట్టేశాడా ?  అంటే ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అవున‌నే అంటున్నాయి. మ‌హ‌ర్షి త‌ర్వాత దిల్ రాజు బ్యాన‌ర్లోనే మ‌హేష్‌బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శక‌త్వంలోనే మ‌రో సినిమా రావాల్సి ఉంది. మ‌హ‌ర్షి హిట్ అయిన వెంట‌నే మ‌హేష్ వంశీకి ఛాన్స్ ఇచ్చ‌డు. వంశీ దిల్‌రాజుకు స‌మీప బంధువు కావ‌డంతో నిర్మాత‌న‌ను కూడా వెతుక్కునే ప‌ని ఉండ‌ద‌నుకున్నారు.

అయితే వంశీ చెప్పిన క‌థ మ‌హేష్‌కు న‌చ్చ‌లేదు. రెండుసార్లు క‌థ డ‌వ‌ల‌ప్ చేసినా ఆ క‌థ మ‌హేష్‌కు న‌చ్చ‌క‌పోవ‌డంతో చివ‌ర‌కు వంశీ – మ‌హేష్ సినిమా క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు మ‌హేష్ ప‌ర‌శురాంతో స‌ర్కారు వారి పాట‌కు క‌మిట్ అయ్యాడు. ఇది అయ్యాక ఎవ‌రితో సినిమా చేస్తాడో ?  తెలియ‌దు. దీంతో మ‌హేష్ ప్రాజెక్టు క్యాన్సిల్ అవ్వ‌డంతో వంశీ పైడిప‌ల్లి ఇప్పుడు చ‌ర‌ణ్‌తో క‌మిట్ అయిన‌ట్టు తెలుస్తోంది.

గ‌తంలో వంశీ – చ‌ర‌ణ్ కాంబోలో ఎవ‌డు సినిమా వ‌చ్చి హిట్ అయ్యింది. లాక్ డౌన్ వేళ ప‌లువురు ద‌ర్శ‌కులు చెప్పిన క‌థ‌ల‌ను చ‌ర‌ణ్ వింటున్నాడు. ఈ క్ర‌మంలోనే వంశీ చెప్పిన లైన్ కూడా చ‌ర‌ణ్‌కు న‌చ్చ‌డంతో ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాను కూడా దిల్ రాజే నిర్మిస్తాడ‌ట‌. ఈ ప్రాజెక్టుపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news