Moviesటాలీవుడ్‌లో త‌ళుక్కున మెరిసిన ఈ హాట్ హీరోయిన్ గుర్తుందా..!

టాలీవుడ్‌లో త‌ళుక్కున మెరిసిన ఈ హాట్ హీరోయిన్ గుర్తుందా..!

తెలుగులో ప్రముఖ దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో వహించిన యువత అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది అక్ష పార్థాసాని. తొలి సినిమాతో హీరోయిన్ గా మంచి మార్కులు వేయించుకున్న ఆమెకు అందం, అభినయం రెండు ఉండడంతో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఆమె హీరోయిన్‌గా మాత్రం విఫలమైంది. ఆమె నటించిన సినిమాలు అన్ని బాక్స్‌ ఆఫీస్ దగ్గర ఫ‌ల్టీ కొట్టాయి.  దీంతో ఆమెకు ఛాన్సులు ఇచ్చేందుకు ఎవరు ముందుకు రాలేదు.

 

 

ఈ క్రమంలోనే అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటుందట. ఆమె చివ‌రిగా శ‌ర్వానంద్ న‌టించిన రాధా సినిమాలో గెస్ట్ రోల్ చేసింది. అయితే షాపుల ఓపెనింగ్‌లు, కాలేజ్‌ఫంక్ష‌న్ల‌కు వెళుతూ తాను లైన్లో ఉన్నాన‌ని నిరూపించుకునేందుకు అష్ట‌క‌ష్టాలు ప‌డుతోంది. ఆమెకు మంచి హాట్ ఇమేజ్ ఉన్నా కూడా ఎందుకో కాలం క‌లిసిరాక స‌క్సెస్ కాలేదు. ఆమె  ఈ యేడాది ఆరంభంలో జ‌మ్తారా – స‌బ్‌కే నెంబ‌ర్ ఆయేగా అనే వెబ్‌సీరిస్‌లో న‌టించింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news