బ్రేకింగ్‌: వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేకు క‌రోనా

ఏపీలో క‌రోనా జోరు ఆగ‌డం లేదు. వ‌రుస పెట్టి ప‌లువురు ప్ర‌జా ప్ర‌తినిధులు క‌రోనా భారీన ప‌డుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు క‌రోనాకు గుర‌వుతున్నారు. నిన్న కాకినాడ ఎంపీ వంగా గీత‌కు క‌రోనా రాగా ఈ రోజు మ‌రో ఎమ్మెల్యే క‌రోనాకు గుర‌య్యారు. నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఆయ‌న కొద్ది రోజులుగా నియోజ‌క‌వ‌ర్గంలో యాక్టివ్‌గా ఉంటున్నారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ చిన్న‌పాటి అస్వ‌స్థ‌త‌కు గుర‌వ్వ‌డంతో క‌రోనా ప‌రీక్ష చేయించుకున్నారు. దీంతో ఆయ‌న్ను హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించి వైద్యం చేయిస్తున్నారు. దీంతో నియోజవర్గంలోని వైసీపీ నేతల్లో, కార్యకర్తల్లో టెన్షన్ నెలకొంది. త‌న‌ను కొద్ది రోజులుగా క‌లిసిన వారు కూడా కోవిడ్ టెస్టులు చేయించుకోవాల‌ని ఎమ్మెల్యే కోటంరెడ్డి కోరారు.