Gossipsఇంట్ర‌స్టింగ్ న్యూస్‌: బండ్ల గ‌ణేష్ - ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్...

ఇంట్ర‌స్టింగ్ న్యూస్‌: బండ్ల గ‌ణేష్ – ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ ప‌క్కా

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ – త్రివిక్ర‌మ్ ఎంత క్లోజో.. ప‌వ‌న్ – నిర్మాత, న‌టుడు బండ్ల గ‌ణ‌ష్ కూడా అంతే క్లోజ్‌. ప‌వ‌న్ త్రివిక్ర‌మ్‌తో మూడు సినిమాలు చేశాడు. బండ్ల – ప‌వ‌న్ కాంబోలో రెండు సినిమాలు వ‌చ్చాయి. బండ్ల మాట మాట‌కు ప‌వ‌న్ భ‌జ‌న ఎంత‌లా చేస్తాడో తెలిసిందే. ఇప్పుడు ఉన్న‌ట్టుండి త్రివిక్ర‌మ్ భ‌జ‌న స్టార్ట్ చేయ‌డంతో ఇండ‌స్ట్రీలో స‌రికొత్త చ‌ర్చ ప్రారంభ‌మైంది. తాజాగా బండ్ల గ‌ణ‌ష్ త్రివిక్ర‌మ్ గురించి మాట్లాడుతూ ఇండ‌స్ట్రీలో నా వ్య‌క్తిగ‌త విష‌యాలు త్రివిక్ర‌మ్‌తో మాత్ర‌మే షేర్ చేసుకుంటాన‌ని చెబుతున్నాడు.

సాధార‌ణంగా త్రివిక్ర‌మ్ ఫోన్ ఎత్త‌డ‌ని.. తాను ఫోన్ చేశాక తిరిగి రెండు రోజుల త‌ర్వాత ఫోన్ చేసి మాట్లాడ‌తాడ‌ని బండ్ల చెప్పాడు. ఇక త్రివిక్ర‌మ్ ఏది చెప్పినా త‌న‌కు క‌రెక్ట్ అవుతుంద‌ని.. ఇండ‌స్ట్రీలో మ‌న విష‌యాలు బ‌య‌ట‌కు చెపితే లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ అని.. అదే త్రివిక్ర‌మ్‌కు చెపితే బ్యాంక్ లాకర్ లో ఉన్నట్టే అని చెప్పాడు. ఇక త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన త్రివిక్ర‌మ్‌తో సినిమా చేసే ఛాన్స్ మాత్రం రాలేద‌ని చెప్పాడు.

త‌నకు గబ్బర్ సింగ్ సినిమాను నిర్మించే అవకాశం ఇప్పించింది కూడా త్రివిక్రమే అని అంటున్నాడు. బండ్ల త్రివిక్ర‌మ్ భ‌జ‌న స్టార్ట్ చేయ‌డంతో ఇండ‌స్ట్రీలో స‌రికొత్త ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. త‌న భ‌క్తుడు ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో ఓ సినిమాకు బండ్ల ప్లాన్ వేశాడ‌ని అంటున్నారు. అయితే త్రివిక్ర‌మ్ హారిక‌ను కాద‌ని బండ్ల‌తో సినిమా చేస్తాడా ? అన్న‌ది కూడా చూడాలి.

మ‌రోవైపు బండ్ల మాత్రం ఈ క్రేజీ కాంబినేష‌న్ కోసం సీరియ‌స్‌గా ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టేశాడ‌ట‌. ఇక చిరంజీవితో కూడా ఓ సినిమా త‌ప్ప‌కుండా చేస్తానంటున్నాడు బండ్ల‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news