అఫీషియ‌ల్‌: అన్న డైరెక్ట‌ర్‌తో త‌మ్ముడు సినిమా ఫిక్స్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ రోజు సోష‌ల్ మీడియా అంతా దుమ్ము రేగుతోంది. ప‌వ‌న్ సినిమా మోష‌న్ పోస్ట‌ర్లు, క్రిష్ సినిమా, హ‌రీష్ శంక‌ర్ సినిమా అప్‌డేట్లు అంటూ ఒక్క‌టే వార్త‌ల మోత మోగించేస్తున్నారు ప‌వ‌న్ ఫ్యాన్స్‌. ఇదిలా ఉంటే ప‌వర్ స్టార్ పవన్ కళ్యాణ్ – స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక ప‌వ‌న్ పుట్టిన రోజు కానుక‌గా ఈ వార్త‌లు నిజం చేస్తూ అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ – సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్లో సినిమా అనౌన్స్ చేశారు నిర్మాత రామ్ తాళ్లూరి. ప‌వ‌న్‌కు బెర్త్ డే విషెస్ చెపుతూ ఆయ‌న ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ క్రేజీ కాంబినేష‌న్‌ను సెట్ చేసిన‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ సినిమాకు వ‌క్కంతం వంశీ స్టోరీ అందిస్తున్నాడ‌ని అంటున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడ ఉంటుంది ? అన్న‌ది మాత్రం క్లారిటీ లేదు.

ప్ర‌స్తుతం ప‌వ‌న్ వ‌కీల్‌సాబ్ చేస్తున్నాడు. ఆ వెంట‌నే క్రిష్ సినిమా ఉంది. ఆ త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్‌తో గ‌బ్బ‌ర్‌సింగ్ 2 చేస్తున్నాడు. ఇక ఆ వెంట‌నే త్రివిక్ర‌మ్ లైన్లో ఉన్నాడంటున్నారు. మ‌రి ఇవి ఎప్పుడు కంప్లీట్ చేసుకుని సురేంద‌ర్ రెడ్డి ప్రాజెక్టులో చేస్తాడో అయితే క్లారిటీ ఇవ్వ‌లేదు.  ఏదేమైనా ఇప్ప‌టికే ఎన్టీఆర్‌, మ‌హేష్‌, చెర్రీని డైరెక్ట్ చేసిన సురేంద‌ర్ రెడ్డి సైరాతో చిరును కూడా డైరెక్ట్ చేశారు. ఇప్పుడు ఏకంగా ప‌వ‌న్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ ద‌క్కించుకున్నాడు.