Movies40 ఏళ్లు వ‌స్తున్నా అనుష్క‌కు ఇంత క్రేజా.... స్వీటీ దెబ్బ మామూలుగా...

40 ఏళ్లు వ‌స్తున్నా అనుష్క‌కు ఇంత క్రేజా…. స్వీటీ దెబ్బ మామూలుగా లేదే..

అప్పుడెప్పుడో 15 ఏళ్ల క్రితం నాగార్జున సూప‌ర్ సినిమాతో వెండితెర‌కు ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ‌. తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డం, హిందీ భాషల్లో వ‌రుస పెట్టి సినిమాలు చేస్తోన్న ఆమె బాహుబ‌లి త‌ర్వాత నార్త్ ఇండియ‌న్ సినిమా అభిమానుల‌కు కూడా బాగా ద‌గ్గ‌రైంది. ఇక సౌత్‌లో అనుష్క అంద‌రు హీరోల ప‌క్క‌న న‌టించింది. ఇక లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో న‌టించిన అనుష్క‌కు తెలుగు ప్రేక్ష‌కుల్లో తిరుగులేని క్రేజ్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే అనుష్క‌కు తిరుగులేని ఫాలోవ‌ర్స్ వ‌స్తున్నాయి. ఆమె సోష‌ల్ మీడియా అక్కౌంట్ అయిన ఫేస్‌బుక్‌లో ఆమెను ఏకంగా 23 మిలియ‌న్ల మంది ఫాలో అవుతున్నారు. ఈ విష‌యంలో ఆమె టాప్ సెల‌బ్రిటీల‌ను కూడా బీట్ చేసింది.

News18 Telugu - అనుష్క శెట్టి ఖాతాలో మరో రికార్డు.. దేవసేన మజాకా.. | Anushka  shetty another record she reach 20 million mark in facebook- Telugu News,  Today's Latest News in Telugu

ప్ర‌భాస్‌కు 19 ల‌క్ష‌ల మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఉంటే, అక్కినేని స‌మంతకు 17 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్‌ ఉన్నారు. ఇక అనుష్క‌కు ఇన్‌స్టా గ్రామ్‌లో కూడా 3.7 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఉన్నారు. దీనిని బ‌ట్టి అనుష్క క్రేజ్ టాప్ సెల‌బ్రిటీల‌నే మించేలా ఉంద‌నే చెప్పాలి. ఇక అనుష్క న‌టించిన లేటెస్ట్ సినిమా నిశ్శ‌బ్దం సినిమా అమోజాన్ ప్రైమ్‌లో రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమా రైట్స్ ను అమోజాన్ ప్రైమ్ దాదాపు 25 కోట్ల పెట్టి స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుందని సమాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news