Gossipsమ‌హేష్‌తో సినిమాకు రెడీ అన్న స్టార్ డైరెక్ట‌ర్‌... దండం పెట్టేస్తోన్న ఫ్యాన్స్‌...!

మ‌హేష్‌తో సినిమాకు రెడీ అన్న స్టార్ డైరెక్ట‌ర్‌… దండం పెట్టేస్తోన్న ఫ్యాన్స్‌…!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుతో సినిమా ఛాన్స్ వ‌స్తే ఏ డైరెక్ట‌ర్ అయినా సూప‌ర్ డూప‌ర్ హిట్ ఇవ్వాల‌ని కోరుకుంటాడు. మ‌హేష్‌తో  హిట్ కొడితే ఆ డైరెక్ట‌ర్ రేంజ్ ఎలా మారిపోతుందో చెప్ప‌క్క‌ర్లేదు. అయితే సౌత్ ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌. మురుగ‌దాస్‌కు మ‌హేష్ బంప‌ర్ ఛాన్స్ ఇస్తే స్పైడ‌ర్ లాంటి బ‌ల‌హీన‌మైన క‌థ‌తో ఓ చెత్త సినిమా తెర‌కెక్కించాడు. ఈ సినిమా మ‌హేష్ ఫ్యాన్స్‌ను, మురుగ‌దాస్ ఫ్యాన్స్‌ను తీవ్రంగా డిజప్పాయింట్ చేసింది. భారీ అంచ‌నాల‌తో వ‌చ్చి భారీ డిజాస్ట‌ర్ అయ్యింది.

మ‌హేష్ సైతం తీవ్ర నిరాశ చెందాడు. ఇక తాజాగా మురుగ‌దాస్ తాజా ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు. స్పైడ‌ర్ ప్లాప్ అయినందుకు తాను ఇప్ప‌ట‌కీ బాధ‌ప‌డుతూనే ఉంటాన‌ని.. మ‌హేష్ పైకి ఎంత తెలుపో.. త‌న మ‌న‌స్సు  కూడా అంతే తెలుపు అని చెప్పిన మురుగ‌దాస్‌…. ఈ సినిమా ప్లాప్ అయ్యాక కూడా మ‌హేష్ త‌న‌తో వారం రోజుల పాటు చాట్ చేసి ఇండ‌స్ట్రీలో హిట్‌, ప్లాప్ అనేది కామ‌న్ అంటూ ధైర్యం చెప్పాడ‌ని మురుగ‌దాస్ చెప్పుకొచ్చాడు.

ఇక మహేష్ కోసం మరో సినిమా రెడీ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఈసారి జాగ్రత్తలు తీసుకుని స్క్రిప్ట్ రెడీ చేస్తున్నానని మురుగ‌దాస్ చెప్పినా కూడా మ‌హేష్ అభిమానులు మాత్రం త‌మ హీరో ఎంతో మంచి ఛాన్స్ ఇస్తే భారీ బ‌డ్జెట్ పెట్టి ఓ నాసిర‌కం సినిమాను మా ముందుకు వ‌దిలాడ‌ని.. మురుగ‌దాస్‌ను మ‌ళ్లీ ఎలా న‌మ్మ‌గ‌లం అంటూ సోష‌ల్ మీడియాలో మురుగదాస్‌ను ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి మురుగ‌దాస్‌కు మ‌హేష్ మ‌రో ఛాన్స్ ఇచ్చే సాహ‌సం చేస్తాడా ? అన్న‌ది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news