Newsవిజ‌య‌వాడ‌లో భార్య చెల్లిని త‌ల్లిని చేసిన కామాంధుడు

విజ‌య‌వాడ‌లో భార్య చెల్లిని త‌ల్లిని చేసిన కామాంధుడు

సోద‌ర స‌మానురాలు అయిన మ‌ర‌ద‌లిపైనే క‌న్నేసిన ఓ కామాంధుడు ఆమెను కూడా గ‌ర్భ‌వ‌తిని చేశాడు. ప్రెగ్నెన్సీతో ఉన్న అక్క‌కు సాయం చేయ‌డానికి అక్క ఇంటికి వెళ్లిన ఆ మ‌ర‌ద‌లిపై బావ క‌న్ను ప‌డింది. ఆమెను కూడా లొంగ‌దీసుకుని ఆమెను కూడా గ‌ర్భ‌వ‌తిని చేశాడు. ఈ సంఘ‌ట‌న కృష్ణా జిల్లా ఆగిరిప‌ల్లి మండ‌ల ప‌రిధిలో జ‌రిగింది. ఆగిరిప‌ల్లి మండ‌లం చొప్ప‌ర‌మెట్ల‌కు చెందిన ఒంగూరు ఇజ్రాయేలు ప్ర‌స్తుతం వ‌డ్ల‌మానులో నివాసం ఉంటున్నాడు.

ఇజ్రాయేలుకు కొంత కాలం క్రితం విజ‌య‌వాడ‌కు చెందిన యువ‌తితో పెళ్లి జ‌రిగింది. ఆమె గ‌ర్భం దాల్చ‌డంతో ఆమెకు సాయం చేసేందుకు వెళ్లిన చెల్లి ( ఇజ్రాయేలు మ‌ర‌ద‌లు)పై అత‌డి క‌న్ను ప‌డింది. ఆమెకు మాయ‌మాటలు చెప్పి లొంగ‌దీసుకుని ప‌లుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో చెల్లి కూడా గ‌ర్భం దాల్చింది. ఈ క్ర‌మంలోనే ఆమెకు ఇటీవ‌ల క‌డుపు నొప్పి రాగా ప‌రీక్ష‌లు చేయించ‌గా ఆమె కూడా గ‌ర్భ‌వ‌తి అన్న విష‌యం బ‌య‌ట ప‌డింది.

చివ‌ర‌కు ఆ అమ్మాయిల త‌ల్లిదండ్రులు పోలీసుల‌ను ఆశ్ర‌యించి త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరారు. పోలీసులు ఇజ్రాయేల్‌పై కేసు న‌మోదు చేసి.. అత‌డిని అరెస్టు చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news