Moviesఆ సీనియ‌ర్ హీరోయిన్‌తో దావూద్ ఇబ్ర‌హీం ఎఫైర్‌... గుట్టు ర‌ట్టు చేసిన...

ఆ సీనియ‌ర్ హీరోయిన్‌తో దావూద్ ఇబ్ర‌హీం ఎఫైర్‌… గుట్టు ర‌ట్టు చేసిన పాక్ మీడియా

ముంబై పేలుళ్ల కేసులో ప్ర‌ధాన సూత్ర‌ధారిగా ఉన్న మోస్ట్ వాంటెడ్ టెర్ర‌రిస్టు దావూద్ ఇబ్ర‌హీం ప్ర‌స్తుతం క‌రాచీలో ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. ముంబై పేలుళ్ల త‌ర్వాత దుబాయ్ మీదుగా పాకిస్తాన్ పారిపోయి అక్క‌డ క‌రాచీలో త‌ల‌దాచుకుంటోన్న దావూద్ అక్క‌డ త‌న నుంచే ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న త‌న చీక‌టి సామ్రాజ్యాన్ని న‌డుపుతున్నాడు. ఇక పాక్‌లో దావూద్‌కు ఓ గ‌ర్ల్ ఫ్రెండ్ ఉంద‌ని అక్క‌డ మీడియా క‌థ‌నం.

పాక్‌లో ఐటెం గ‌ర్ల్‌, హీరోయిన్‌గా చిన్నా చిత‌కా పాత్ర‌లు వేసిన 37 ఏళ్ల మోహ్విష్ హయాత్‌తో దావూద్ కొద్ది రోజులుగా సీక్రెట్‌గా ఎఫైర్ న‌డుపుతున్నాడ‌న్న ప్ర‌చారం ఉంది. అసలు ఎంత మాత్రం గుర్తింపులేని హ‌య‌త్‌కు ఏకంగా పాక్ అత్యున్న‌త పౌర పుర‌స్కారం ద‌క్క‌డం వెన‌క కూడా దావూద్ హ‌స్తం ఉంద‌నే అంటున్నారు. పాకిస్తాన్ సినిమా ఇండ‌స్ట్రీలో దావూద్ భారీగా పెట్టుబ‌డులు పెట్టాడ‌ని.. అందుకే దావూద్ అక్క‌డ ఇండ‌స్ట్రీని  ఓ ఆటాడిస్తూ కొంద‌రు హీరోయిన్ల‌తో ఎఫైర్లు న‌డుపుతున్నాడ‌ని పాక్‌లో గుస‌గుస‌లు ఎక్కువుగా వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news