Moviesప్ర‌భాస్ A- ఆదిపురుష్ బడ్జెట్... క‌థ వింటేనే ఫ్యూజులు ఎగురుతున్నాయ్‌..!

ప్ర‌భాస్ A- ఆదిపురుష్ బడ్జెట్… క‌థ వింటేనే ఫ్యూజులు ఎగురుతున్నాయ్‌..!

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ గ‌త కొంత కాలంగా వ‌రుస‌గా పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. బాహుబ‌లి 1,2 – సాహో త‌ర్వాత ప్రస్తుతం న‌టిస్తోన్న రాధేశ్యామ్‌, నాగ్ అశ్విన్ సినిమా ఇలా వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ప్ర‌భాస్ 22వ సినిమా కూడా అధికారికంగా క‌న్‌ఫార్మ్ అయ్యింది. ప్ర‌భాస్ 22వ సినిమా ప్ర‌క‌ట‌న వ‌చ్చిన వెంట‌నే దేశ‌వ్యాప్తంగా ఉన్న అభిమానులు షాక్‌లో ఉన్నారు. `A- ఆదిపురుష్` పేరుతో భారతదేశ సినిమా చ‌రిత్ర‌లోనే తిరుగులేని విధంగా దీనిని తెర‌కెక్కించ‌నున్నారు.

 

ఆదిపురుష్ స్టోరీ రామాయ‌ణం ఇతిహాసంపై ఆధార‌ప‌డి ఉంది. ప్ర‌భాస్ ఈ సినిమాలో రాముడి పాత్ర‌లో న‌టించ‌నున్నాడు. 3 డీ ఫార్మాట్ తెర‌కెక్కే ఈ సినిమాలో విజువ‌ల్ ఎఫెక్ట్స్ మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంటాయ‌ట‌. 2021లో సెట్స్ మీద‌కు వెళ్లే ఈ సినిమా 2022లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో విల‌న్ రోల్ కోసం పలువురు బాలీవుడ్ న‌టుల పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. రు. 500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నుంద‌ట‌. హిందీ, తెలుగు భాష‌ల‌తో పాటు తమిళం..మలయాళం .. కన్నడ భాషలలో కూడా ఈ సినిమా అనువ‌దిస్తున్నారు. రామాయ‌ణం నేప‌థ్యంలో సాగే స్టోరీ కావ‌డంతో విజువల్స్‌, తారాగ‌ణం ఎలా ఉంటుందో ఊహించుకుంటుంటేనే ఫ్యూజులు ఎగిరిపోయేలా ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news