Gossipsబాల‌య్య - బోయ‌పాటి BB3 టైటిల్... బాల‌య్య ముద్దుపేరే టైటిల్‌గా ఫిక్స్...

బాల‌య్య – బోయ‌పాటి BB3 టైటిల్… బాల‌య్య ముద్దుపేరే టైటిల్‌గా ఫిక్స్ చేశారే..!

యువ‌ర‌త్న నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ టైటిల్‌పై గ‌త కొంత కాలంగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ర‌క‌ర‌కాల టైటిల్స్ కూడా ప్ర‌చారంలో ఉన్నాయి. ఇంత‌కు ముందు ఈ సినిమాకు మోనార్క్‌, సూపర్ మేన్, డేంజర్, మొనగాడు లాంటి టైటిల్స్ కూడా వినిపించాయి. ఇక అప్డేట్ ప్ర‌కారం ఇవేవి ఈ సినిమా టైటిల్స్ కాద‌ని… బొనాంజ అనే టైటిల్‌ను సినిమా యూనిట్ ఓకే చేసింద‌ని అంటున్నారు.

 

బాల‌య్య‌ను ముద్దుగా బాక్సాఫీస్ బొనాంజ అని పిలుస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో అమ‌లాపాల్ ఒక హీరోయిన్ కాగా.. రెండో హీరోయిన్ కోసం అన్వేష‌ణ జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం క‌రోనా వ‌ల్ల ఈ సినిమా షూటింగ్ లేట్‌గా ప్రారంభం కానుంది. వ‌చ్చే నెల నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాలో బాల‌య్య రెండు వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించనున్నారు. ఒక‌టి అఘోరా రోల్ కాగా.. మ‌రొక‌టి ఫ్యాక్ష‌నిస్ట్ రోల్ అని అంటున్నారు. థ‌మ‌న్ మ్యూజిక్ ఇచ్చే ఈ సినిమాకు మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మాత‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news