Moviesఆ టీవీపై మ‌హేష్ షాకింగ్ ట్వీట్‌... ఇంట్ర‌స్టింగ్‌గా ఉందే..

ఆ టీవీపై మ‌హేష్ షాకింగ్ ట్వీట్‌… ఇంట్ర‌స్టింగ్‌గా ఉందే..

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు సోష‌ల్ మీడియాలో చేసే ట్విట్ల‌కు ఎంత క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఏ విష‌యంలో అయినా అరుదుగా ఆచితూచి స్పందించే మ‌హేష్ తాజాగా చేసిన ట్విట్ ఇంట్ర‌స్టింగ్‌గా ఉండ‌డంతో పాటు వైర‌ల్ అవుతోంది. ఈటీవీ ఎంట‌ర్టైన్‌మెంట్ ఛానెల్ స‌క్సెస్‌ఫుల్‌గా 25 సంవ‌త్స‌రాలు కంప్లీట్ చేసుకుంది. ఈ క్ర‌మంలోనే ఈటీవీ ప్ర‌తి ఒక్క‌రి ఇళ్ల‌ల్లో మ‌న టీవీగా ముద్ర వేసుకుంది. ఈ 25 ఏళ్ల ప్ర‌స్తానంలో ఎప్పుడూ టాప్ రేటింగ్‌లోనే కొన‌సాగింది.

Mahesh Babu and Vamshi Paidipally to reunite

ఇక ఈటీవీ 25 ఏళ్ల ప్ర‌స్థానం సంద‌ర్భంగా ప‌లువురు సెల‌బ్రిటీలు కామెంట్లు చేస్తూ యాజ‌మాన్యానికి శుభాకాంక్ష‌లు చెపుతున్నారు. ఈ క్ర‌మంలోనే మ‌హేష్‌బాబు చేసిన ట్వీట్ సైతం ఇంట్ర‌స్టింగ్‌గా మారింది. ఈటీవీ 25 ఏళ్ల ప్ర‌స్థానం సంద‌ర్భంగా మ‌హేష్ ఈటీవీ సంస్థ‌ల అధినేత రామోజీరావుకు కంగ్రాట్స్ చెప్పారు. రెండు ద‌శాబ్దాల ప్ర‌యాణం, ఈనాడు నెట్ వ‌ర్క్ ఎదిగిన విధానం మాకు సంతోష‌క‌రం.. రామోజీరావు గారికి, ఈటీవీ టీం, ప్రేక్ష‌కుల‌కు శుభాకాంక్ష‌లు అని ట్వీట్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news