Newsకంటెంట్ రాస్తారా.. ఫేస్‌బుక్ గుడ్ న్యూస్

కంటెంట్ రాస్తారా.. ఫేస్‌బుక్ గుడ్ న్యూస్

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త మార్పుల‌తో దూసుకుపోతోంది. ఈ క్ర‌మంలోనే కంటెంట్ రైటింగ్‌లో క్రియేటివిటి ఉన్న వారిని ప్రోత్స‌హించేందుకు ఫేస్‌బుక్ స‌రికొత్త మార్పులు, చేర్పుల‌తో పాటు కొత్త బిజినెస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నుంది. ప్ర‌స్తుతం ఫేస్‌బుక్ 300 కోట్ల మంది యూజ‌ర్ల‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా తిరుగులేని విధంగా అగ్ర‌స్థానంలో ఉంది. ఈ క్రమంలోనే వార్తా సేవ‌ల రంగంలోకి కూడా రావాల‌ని కూడా ప్లాన్ చేస్తోంది.

ఇప్ప‌టికే అగ్ర‌రాజ్యం అమెరికాలో వార్త సేవల్ని ప్రారంభించిన ఫేస్‌బుక్ ఇప్పుడు జ‌ర్మ‌నీ, యూకే, ఫ్రాన్స్‌, భార‌త్ త‌దిత‌ర దేశాల‌కు కూడా ఈ సేవ‌లు విస్త‌రించాల‌ని ప్లాన్ చేస్తోంది. వ‌చ్చే ఆరు నెలల్లో ఇందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించుకుని ఈ రంగంలోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే కంటెంట్ రాసే వారికి డ‌బ్బు చెల్లించేందుకు కూడా కంపెనీ సిద్ధంగా ఉంద‌ని ఫేస్‌బుక్ ప్ర‌తినిధులు తెలిపారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న వినియోగ‌దారుల అభిరుచికి అనుగుణంగా కంటెంట్ క్రియేట్ చేసి… స‌రికొత్త బిజినెస్ మోడ‌ల్‌తో యూజ‌ర్ల ముందుకు రావాల‌న్న‌దే ఫేస్‌బుక్ టార్గెట్‌గా తెలుస్తోంది. అటు ప్ర‌పంచ వ్యాప్తంగా న్యూస్ ఇండ‌స్ట్రీకి ఊతం ఇవ్వ‌డంతో పాటు చాలా మందికి ఉపాధి క‌ల్ప‌నే ల‌క్ష్యంగా ఫేస్‌బుక్ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news