Gossipsబికినీలో కీర్తి సురేష్‌... అందుకే ఆ ప‌ని చేస్తోందా...!

బికినీలో కీర్తి సురేష్‌… అందుకే ఆ ప‌ని చేస్తోందా…!

టాలీవుడ్‌లో మ‌హాన‌టి సినిమా త‌ర్వాత కీర్తి సురేష్ క్రేజ్ ఎలా పాపుల‌ర్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్పుడు కీర్తి కి వ‌రుస పెట్టి స్టార్ హీరోల సినిమాల్లో అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఆమె కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా అందాల ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు ఆమె ఎప్పుడూ దూరంగానే ఉంటూ వ‌చ్చింది. అలాంటిది ఇప్పుడు ఆమె బికినీ ధ‌రించ‌నుంద‌ని.. అది కూడా ఓ టాలీవుడ్ సినిమాలో అన్న వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా గ్లామ‌ర్ ప‌రంగా హ‌ద్దులు దాట‌ని కీర్తి ఇప్పుడు ఏకంగా బికినీ వేయ‌డం ఏంటా ? అని అంద‌రూ ఒక్క‌సారిగా షాక్ అవుతున్నారు.

 

ఈ రూమ‌ర్స్‌కు కార‌ణం ఆమె బ‌రువు త‌గ్గాల‌ని డిసైడ్ అవ్వ‌డ‌మే. హీరోయిన్ల‌కు ఉండాల్సిన మొద‌టి ల‌క్ష‌ణం స్లిమ్‌గా ఉండ‌డ‌మే… ఎంత టాలెంట్ ఉన్నా శ‌రీరం మీద అదుపు కోల్పోతే అవ‌కాశాలు రావు. గ‌తంలో చాలా మంది హీరోయిన్ల‌కు టాలెంట్ ఉన్నా ముందు శ‌రీరంపై అదుపు ఉండాలి. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు కీర్తి సురేష్ సైతం బ‌రువు త‌గ్గుతోంది. నిన్న‌టి వ‌ర‌కు బొద్దుగా ఉన్న ఈ అమ్మ‌డు ఇప్పుడు చ‌క్క‌నమ్మ‌గా మారిపోయింది. దీనికి కార‌ణం కీర్తీ ఓ సినిమాలో బికినీలో క‌నిపించ‌నుంద‌ని.. అందుకోస‌మే ఆమె నాజూగ్గా మారింద‌ని అంటున్నారు.

 

ప్ర‌స్తుతం ఆమె తెలుగులో మిస్ ఇండియా అనే ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది. ఆ సినిమాలో పాత్ర డిమాండ్ మేరకు ఆమె బికినీలో క‌న‌ప‌డుతుంద‌ట‌. ఈ క‌థ‌నాల‌పై కీర్తి సురేష్ స్పందించింది. ఆరోగ్యం కోస‌మే తాను బ‌రువు త‌గ్గాన‌ని చెపుతున్నా.. మిస్ ఇండియాలో మాత్రం కాస్త గ్లామ‌ర్ ట‌చ్ ఎక్కువుగానే ఉంటుంద‌ని తెలుస్తోంది. మ‌రి కీర్తి నిజంగానే బికినీ వేస్తే కుర్రకారుకు ఆ మాజ‌యే వేరు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news