Moviesత‌న‌పై వ‌స్తోన్న పుకార్ల‌పై స్పందించిన సురేఖ‌వాణి... !

త‌న‌పై వ‌స్తోన్న పుకార్ల‌పై స్పందించిన సురేఖ‌వాణి… !

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఉన్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల్లో సురేఖ వాణి ఒక‌రు. తెలుగులో ఆమె అక్క‌, వ‌దిన‌, చెల్లి, ఆంటీ ఇలా ఎన్నో పాత్ర‌ల్లో చ‌క్క‌గా వ‌దిగిపోయారు. ఆమె ఇటీవ‌ల త‌న సోష‌ల్ మీడియా ద్వారా యాక్టివ్‌గా ఉంటూ ర‌క‌ర‌కాల వీడియోలు షేర్ చేస్తున్నారు. సురేఖ‌వాణితో పాటు ఆమె కుమార్తె సైతం జిమ్‌లో చేసిన వీడియోలు, మోడ్ర‌న్ డ్రెస్సుల్లో ఉన్న స్టిల్స్‌ను షేర్ చేస్తుంటారు. అయితే దీనిపై ఆమెను నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా టార్గెట్‌గా చేస్తూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

 

ఆమె కుమార్తె సైతం పెద్ద‌ది అయినా ఇద్ద‌రు క‌లిసి ఎంతో మోడ్ర‌న్‌గా ఉంటూ ఉంటారు. ఈ క్ర‌మంలోనే ఆమె కూడా సోష‌ల్ మీడియా బాధితుల్లో ఒక‌రిగా మారారు. తాను ఒంట‌రిగా క‌నిపించిన‌ప్పుడు… లేదా ఎవ‌రితో అయినా మ‌గ‌వారితో మాట్లాడుతున్న‌ప్పుడు కొంద‌రు క్రియేట్ చేసే పుకార్ల‌ను వింటూ వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఇలాంటి పుకార్ల‌కు క్లారిటీ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న ఆమె స‌మాజంలో భ‌ర్త లేని ఆడ‌వాళ్ల‌ను ఎలా చూస్తారో త‌న‌కు తెలుస‌ని చెప్పింది.

 

త‌న‌తో క‌నిపించే ప్ర‌తి వారితో తాను మంచి బంధం మాత్ర‌మే క‌లిగి ఉంటాన‌ని.. త‌న జీవితంలో త‌న భ‌ర్త‌ను కోల్పోవ‌డం అతి పెద్ద లోటు అని ఆమె చెప్పింది. ఇక తాను ఎంత స్వేచ్ఛ‌గా ఉంటానో త‌న కూతురును కూడా అంతే స్వేచ్ఛ‌గా పెంచుతాన‌ని సురేఖ‌వాణి తెలిపింది. ఇక త‌న కుమార్తెను సినిమాల్లోకి పంపించే అంశంపై ఆమె మాట్లాడుతూ ఆమె ఇష్ట ప్ర‌కారం సినిమాల్లోకి వెళ‌తానంటే తాను అడ్డు చెప్ప‌న‌ని ఆమె తెలిపింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news