Gossipsఆర్.ఆర్.ఆర్ టీం పై ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ ఫైర్..!

ఆర్.ఆర్.ఆర్ టీం పై ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ ఫైర్..!

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్.ఆర్.ఆర్. ఎన్.టి.ఆర్, రాం చరణ్ వంటి సూపర్ స్టార్స్ ఇద్దరు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై తారాస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. 400 కోట్ల భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో కొమరం భీం గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ కనిపించనున్నారు.

వారు ఫ్రీడం ఫైటర్స్ గా మారక ముందు కథగా ఆర్.ఆర్.ఆర్ వస్తుంది. ఇక ఈ సినిమాకు సంబందించి ప్రతి అప్డేట్ అటు మెగా ఇటు నందమూరి ఫ్యాన్స్ ను ఎక్సైట్ చేస్తుంది. లేటెస్ట్ గా అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆర్.ఆర్.ఆర్ టీం చరణ్ గురించి ప్రస్థావిస్తూ ట్వీట్ చేసింది. అసలైతే ఫస్ట్ లుక్ వస్తుందని అనుకున్నారు కాని అది రాలేదు. అయితే ఆర్.ఆర్.ఆర్ లో ఎన్.టి.ఆర్ కు అన్యాయం జరుగుతుందని కొందరు ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.

తారక్ ను తక్కువ చేసి చూపిస్తే ఊరుకునేది లేదని చరణ్ తో పాటుగా తారక్ గురించి కూడా అప్డేట్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ చరణ్, తారక్ ఇద్దరు సమానమైన రోల్స్ లో కనిపిస్తారని చిత్రయూనిట్ చెప్పుకొస్తున్నా మా హీరోకి ఎక్కువ సీన్స్ కావాలి.. మా హీరోకి ఎక్కువ బిల్డప్ కావాలంటూ లేనిపోని గొడవలు పడుతున్నారు ఫ్యాన్స్. వాళ్లందరికి శాటిస్ఫై చేసేలా జక్కన్న ఆర్.ఆర్.ఆర్ చెక్కుతున్నాడని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news