Gossipsషాకిచ్చే కాంబినేష‌న్‌... ఊహించ‌ని డైరెక్ట‌ర్‌తో బాల‌య్య‌..

షాకిచ్చే కాంబినేష‌న్‌… ఊహించ‌ని డైరెక్ట‌ర్‌తో బాల‌య్య‌..

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారో ? ఎవ్వ‌రికి తెలియ‌దు. త‌న చ‌ర్య‌ల‌తోనే అంద‌రికి షాక్ ఇచ్చే ఆయ‌న త‌న సినిమాల విష‌యంలోనూ అలాగే ఉంటుంటారు. అంద‌రి అంచ‌నాల‌కు భిన్నంగా బాల‌య్య సినిమాలు చేస్తుంటాడు. అంద‌రూ బోయ‌పాటితో బాల‌య్య సినిమా కోసం వెయిటింగ్‌లో ఉంటే ఆయ‌న కేఎస్‌.ర‌వికుమార్‌తో సినిమా చేస్తూ డ‌బుల్ షాక్ ఇచ్చాడు.

ఈ షాక్‌లో ఉన్న బాల‌య్య అభిమానుల‌కు ఇప్పుడు మ‌రో షాక్‌. ఎవ్వ‌రూ ఊహించ‌ని డైరెక్ట‌ర్‌తో బాల‌య్య సినిమా చేసేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం కేఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న బాల‌య్య ఆ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే అ! సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో న‌టించ‌నున్న‌ట్టు టాక్‌.

ఈ శుక్ర‌వారం ప్ర‌శాంత్‌వ‌ర్మ రాజ‌శేఖ‌ర్ హీరోగా తెర‌కెక్కించిన క‌ల్కి రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వ‌స్తోంది. అయితే క్లైమాక్స్‌, సెకండాఫ్ మాత్రం చాలా బాగుంద‌ని కూడా అంటున్నారు. ఈ ప్ర‌మోష‌న్ల‌లోనే తాను బాల‌య్య‌తో సినిమా చేస్తున్న‌ట్టు చెప్పాడు. గ‌తంలో అ సినిమా ప్ర‌మోష‌న్ల‌లోనూ ప్ర‌శాంత్ ఇదే విష‌యం చెప్పాడు.

ప్ర‌శాంత్ రెండు సార్లు బాల‌య్య సినిమా ప్ర‌స్తావ‌న‌కు తీసుకు రావ‌డంతో ప్ర‌శాంత్ వ‌ర్మ – బాల‌య్య కాంబోలో సినిమా త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాత‌, ఇత‌ర వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డ‌య్యే ఛాన్సులు ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news