Gossipsసమంత పేరు మారింది..నాగ చైతన్య మైండ్ బ్లాక్ అయ్యింది..!

సమంత పేరు మారింది..నాగ చైతన్య మైండ్ బ్లాక్ అయ్యింది..!

టాలీవుడ్ లో ఏం మాయ చేసావే సినిమాతో సమంత టాలీవుడ్ లోకి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమా అక్కినేని నట వారసుడు నాగ చైతన్యకు రెండో సినిమా..మంచి హిట్ సినిమా. ఈ సినిమాలో లవర్స్ గా నటించిన చైతూ-సమంత నిజ జీవితంలో కూడా ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. నాగచైతన్యతో పెళ్లికాక ముందు సమంత ప్ర‌భు గా వుండే పేరును సమంత అక్కినేని గా సోషల్ మీడియాలో మార్చేసింది.

తాజాగా మరొకసారి సోషల్ మీడియాలో ఇప్పుడు తన పేరు మార్చుకుంది. అదేంటీ సమంత పేరు మార్చుకోవడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా..అవునండీ ఇది నిజం. సమంత తాజా మూవీ.. `ఓ బేబీ` . ఈమూవీలో సమంత పేరు బేబి. అలాగే సినిమా పేరు కూడా ఓ బేబి. దాంతో సినిమా ప్రమోషన్ కు కలిసొస్తుందని సమంత తెలివిగా ఇలా సోషల్ మీడియాతో తన పేరు మార్చుకుందన్నమాట.

ప్రమోషన్ సంగతి ఏమో కాని ఇలా కూడా చేస్తారా అని అభిమానులు ఆశ్చర్యపోతుంటే..నాగ చైతన్య పరిస్థితి ఏంటీ..ఓబేబీ పేరు విని షాక్ అయి ఉంటారా అని ఫ్యాన్స్ ముచ్చటించుకుంటున్నారు. అయితే పేరు మార్చుకునే ముందు సమంత ఓ మాట చెప్పే ఉంటుందిలే… ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది కదా అని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news