Gossipsఎవరేం అనుకున్నా రెజినాని మాత్రం వదిలేది లేదు.. మొన్నటిదాకా డేటింగ్.. ఇప్పుడు...

ఎవరేం అనుకున్నా రెజినాని మాత్రం వదిలేది లేదు.. మొన్నటిదాకా డేటింగ్.. ఇప్పుడు ఏకంగా..!

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రెజినా కసాండ్రాతో ప్రేమలో పడ్డాడన్న వార్తలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఇద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారని.. రెజినాను పెళ్లాడేందుకు మెగా ఫ్యామిలీలో సైతం సాయి తేజ్ ప్రయత్నించాడని వార్తలు వచ్చాయి. తామిద్దరం కేవలం స్నేహితులమే అంటూ ఈ రూమర్స్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు సాయి తేజ్, రెజినా. ఇద్దరు కలిసి చేసే సినిమా అవకాశాలు వచ్చినా కాదనుకున్నారు.

ప్రస్తుతం రెజినాకు తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. కోలీవుడ్ లో కూడా ఛాన్సులు రావడం కష్టమే అని తెలుస్తుంది. బాలీవుడ్ లో ప్రయత్నించినా లాభం లేదు. అందుకే మరోసారి సాయి ధరం తేజ్ రెజినాకు ఛాన్స్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట. చిత్రలహరితో హిట్ అందుకున్న సాయి తేజ్ తన తర్వాత సినిమా మారుతి డైరక్షన్ లో ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాలో మాళవిక శర్మ ఒక హీరోయిన్ గా నటిస్తుండగా రెండో హీరోయిన్ గా రెజినాను తీసుకోవాలని అంటున్నాడట.

ఒక్క హిట్టు పడిందో లేదో మళ్లీ మెగా హీరోకి సొంత ఆలోచనలు వస్తున్నాయి. అయితే ఒక స్నేహితుడిగా రెజినాకు అవకాశం ఇవ్వాలనుకోవడం తప్పేం లేదు. కాని పిలిచి మరి అవకాశం ఇస్తే కచ్చితంగా మళ్లీ వీళ్లమధ్య ఏదో ఉందని రూమర్స్ వచ్చేస్తాయి. ఏది ఏమైనా సాయి తేజ్, రెజినాల మధ్య అసలు రిలేషన్ ఏంటన్నది వారి ఓపెన్ అయితేనే గాని తెలియదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news