విశ్వక్‌సేన్ ” ఫలక్‌నూమా దాస్ ” రివ్యూ & రేటింగ్

నటీనటులు : విశ్వక్ సేన్, త‌రుణ్ భాస్కర్, హర్షిత గౌర్, సలోని త‌దిత‌రులు
నిర్మాత: విశ్వక్ సేన్
సంగీతం: వివేక్ సాగ‌ర్
దర్శకత్వం: విశ్వక్ సేన్

తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ నగరానికి ఏమైంది చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన హీరో విశ్వక్ సేన్, సొంతంగా డైరెక్ట్ చేస్తూ నటించిన మూవీ ఫలక్‌నుమా దాస్. పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా పోస్టర్స్ మొదలుకొని, టీజర్, ట్రైలర్‌లకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇక నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతున్న ఫలక్‌నుమా దాస్ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకున్నాడో రివ్యూలో చూద్దాం.

కథ:
హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ఏరియాలో దందాలు చేసే రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగే వారే ఈ సినిమా కథ. ఫలక్‌నుమాలో పుట్టిపెరిగిన దాస్(విశ్వక్‌సేన్) అదే ఏరియాలో దందాలు చేసే శంకరన్నను స్పూర్తిగా తీసుకుని అతడిలా ఎదగాలనుకుంటాడు. త‌న‌కంటూ ఓ గ్యాంగ్‌ని త‌యారు చేయాల‌ని అనుకుంటాడు. ఈ క్రమంలోనే శంక‌ర‌న్న హ‌త్య జరగడంతో దాస్ ఆ కేసులో ఇరుక్కుపోతాడు. జీవితంలో ఊహించ‌ని సంఘ‌ట‌న‌ల నుంచి దాస్ చివ‌రికి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? చివ‌రికి దాస్ గ్యాంగ్ ఎలా సెటిల‌య్యారు? దాస్ జీవితంలో ప్రేమక‌థ‌లేంటి? అన్నదే సినిమా కథ.

విశ్లేషణ:
విశ్వక్ సేన్ ఎంచుకున్న కథ పూర్తిగా మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసినట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఓ రీమేక్ చిత్రం అనే భావన మనకు ఎక్కడా కనిపించదు. ఇక కథ పరంగా ఫస్టాఫ్‌లో పాత్రల ఇంట్రొడక్షన్.. వాటిని ఎలివేట్ చేసిన విధానం బాగుంది. విశ్వక్ సేన్ మాస్ ఎంట్రీతో మొదలై, బస్తీలో జరిగే గ్యాంగ్ వార్, పోలీస్ ఛేజ్ లాంటి సీన్లను బాగా చూపించాడు విశ్వక్. ఇక హీరో తన స్నేహితులతో చేసే కామెడీ కూడా మాస్ ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేస్తుంది. ఒక అదిరిపోయే ట్విస్ట్‌తో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది.

సెకండాఫ్‌లో గ్యాంగ్‌ను మెయింటెన్ చేసే దాస్, తన ప్రత్యర్థి గ్యాంగ్‌ నుండి ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు. దాస్ జీవితంలో ఒక్కసారి లవ్ బ్రేకప్ కాగా మరోసారి అతడు ప్రేమలో పడటం.. ఆ అమ్మాయిని దక్కించుకునే విధానాన్ని బాగా చూపించాడు విశ్వక్. ఇక ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్‌కు కావాల్సినంత మాస్ అంశాలను జోడించి చిత్రాన్ని ఒక సీరియస్ నోట్‌తో ముగించిన విధానం విశ్వక్‌లోని ట్యాలెంటెడ్ డైరెక్టర్‌ మనకు చూపించాడు.

ఓవరాల్‌గా ఫలక్‌నుమా దాస్ ముందునుండి చెబుతున్నట్లుగానే పూర్తి మాస్ అంశాలతో తెరకెక్కడమే కాకుండా వాటిని ప్రెజెంట్ చేసిన విధానంతో బి,సి ఆడియెన్స్‌ను పూర్తిగా ఎంటర్‌టైన్ చేస్తుంది. కొన్ని బోరింగ్ సీన్స్‌ను మినహాయిస్తే ఈ సినిమా మాస్ ఆడియెన్స్‌కు బాగా నచ్చడం ఖాయం.

నటీనటుల ప్రతిభ:
విశ్వక్ సేన్ ఈ సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశాడు. అటు యాటిట్యూడ్ ఉన్న హీరోగా, గ్యాంగ్‌ వార్‌లో తన సత్తా చూపిస్తూనే, కాలేజీ కుర్రాడిగా తన పర్ఫార్మెన్స్‌తో ఆడియెన్స్‌ను కట్టిపడేశాడుక. ఫలక్‌నుమా దాస్‌గా ఔట్ అండ్ ఔట్ మాస్ హీరోగా అతడు మెప్పించిన తీరు భేష్. ఇక ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో నటించాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. ఉత్తేజ్ పాత్ర సినిమాకు మేజర్ అసెట్ అని చెప్పాలి. మిగతా వారు తమ పాత్రలమేర బాగా నటించారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడిగా విశ్వక్ సేన్ పూర్తిగా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇది ఓ రీమేక్ చిత్రం అనే విషయాన్ని మనకు ఎక్కడా తెలీకుండా బాగా మేనేజ్ చేశాడు. ఇక ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అదిరిపోయే బస్తీ సెటప్‌లు ఈ సినిమాకు సహజత్వాన్ని తీసుకొచ్చాయి. వివేక్ సాగర్ అందించిన మ్యూజిక్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:
ఈ దాస్‌గాడు మెప్పించలేదు..!

రేటింగ్: 2/5

Leave a comment