మహర్షి టీజర్ లో రెండు డైలాగులు..

గత ఏడాది కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సూపర్ హిట్ అయ్యింది. మహేష్ కెరీర్ లో రూ.200 కోట్ల క్లబ్ లో చేరిన మూవీకి కొత్త రికార్డు నమోదు చేసుకుంది. ఈ సినిమా తర్వాత వంశం పైడి పల్లి దర్శకత్వంలో మహేష్ బాబు,పూజా హెగ్డే ‘మహర్షి’సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ మద్య ఓ లిరికల్ సాంగ్ కూడా రిలీజ్ అయ్యింది.

ఇక ఉగాది కానుకగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఒకటి రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్దమవుతున్నారు. అయితే టీజర్ ఎలా వుంటుందా? అని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సినిమా ఓవర్ సీస్ మార్కెట్ ఇంకాకాలేదు. అయితే ఈ టీజర్ కి సంబంధించిన అన్ని పనులు పూర్తవుతున్నాయని సమాచారం. ఇందులో యాక్షన్ సీన్ కోసం ఓ రౌడీని ఎత్తి కుదేసి, డైలాగ్ చెప్పే సీన్ ఒకటి వుంటుందని తెలుస్తోంది.

అంతే కాదు అలాగే భరత్ అనే నేను సినిమాలో మైకు ముందు మాట్లాడినట్లుగా, ఈ టీజర్ లో కూడా అలాంటి సీన్ ఒకటి వుంటుందని తెలుస్తోంది. టీజర్ అటు క్లాస్, ఇటు మాస్ టైపులో సమానంగా ఎఫెక్ట్ వచ్చేలా కట్ చేసినట్లు తెలుస్తోంది. వంశి పైడి పల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని పివిపి, అశ్వనీదత్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్నారు.

Leave a comment