చెర్రీకి తీవ్ర గాయాలు..ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ క్యాన్సిల్..!

ప్రముఖ దర్శకులు రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు, కొమురంభీమ్ లకు సంబంధించిన 1920 నాటి పరిస్థితుల్లో ఎలా ఉన్నదన్న విషయాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారట. దీనికి సంబంధించిన వివరాలు ఆ మద్య ప్రెస్ మీట్ లో రాజమౌళి తెలిపారు.

ఈ సినిమా షూటింగ్ మొన్నటి వరకు హైదరాబాద్ లోని రామోజీ ఫిలిమ్ సిటీలో జరిగింది. మూడో షెడ్యూలో పూనేలో ప్లాన్ చేశారు. అయితే షూటింగ్ లో ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా..రాంచరణ్ కి కాలుకు తీవ్ర గాయం అయినట్లు సమాచారం. దాంతో ఆయన సరిగ్గా నడవాలన్నా , పరుగెత్తాలన్నా కూడా కష్టమే దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్ ఆర్ ఆర్ చిత్ర షూటింగ్ ని వాయిదా వేశారు .

రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించనున్న విషయం తెలిసిందే . 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఆర్ ఆర్ ఆర్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే .

Leave a comment