Gossipsఒక్క ట్రైలర్ తో ఎన్టీఆర్ ని అవమానించిన బాలీవుడ్..!

ఒక్క ట్రైలర్ తో ఎన్టీఆర్ ని అవమానించిన బాలీవుడ్..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కెరియర్ లో టెంపర్ సక్సెస్ టర్నింగ్ పాయింట్. మూస థోరణిలో సినిమాలు చేస్తున్న ఎన్.టి.ఆర్ కు టెంపర్ సక్సెస్ తన కళ్లు తెరచుకునేలా చేశాయి. ఇక ఆ సినిమా నుండి వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు ఎన్.టి.ఆర్. టెంపర్ నుండి అరవింద సమేత సినిమా వరకు తన విజయ పరంపర కొనసాగిస్తున్నాడు ఎన్.టి.ఆర్. అయితే అలాంటి టెంపర్ హింది రీమేక్ చేస్తున్నారు. రణ్ వీర్ సింగ్ హీరోగా సారా ఆలీ ఖాన్ హీరోయిన్ గా రోహిత్ శెట్టి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ లో కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మించారు.
2
తెలుగులో టెంపర్ ఓ ఇంటెన్సిటీ ఉన్న సినిమా.. కాని హిందిలో అది సింగం సీక్వల్ గా మార్చేశాడు దర్శకుడు రోహిత్ శెట్టి. ఎందుకు టెంపర్ ను అలా మార్చాల్సి వచ్చిందో ఏమో కాని అక్కడ సింబా ఓ కామెడీ సినిమాగా తెరకెక్కించారు. రన్ వీర్ సింగ్ కూడా అలానే కామెడీ చేశాడు. అంతేకాదు ఈ సినిమా రోహిత్ శెట్టి డైరక్షన్ లో వచ్చిన సింగం సినిమాకు సీక్వల్ గా కటింగ్ ఇచ్చారు. చివర్లో అజయ్ దేవగణ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. సింగం సీరీస్ లో భాగంగా టెంపర్ ను రీమేక్ చేయడం విశేషం.

Jr Ntr  Kajal Agarwal Temper movie Latest HD  Posters
Jr Ntr Kajal Agarwal Temper movie Latest HD Posters

అయితే సింబా ట్రైలర్ చూసిన ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ ట్రైలర్ మీద రోహిత్ శెట్టిల మీద రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మంచి సినిమాను ఇలా నాశనం చేస్తారా అంటూ దుయ్యబట్టారు. డిసెంబర్ 28న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ బాలీవుడ్ ఆడియెన్స్ ను మెప్పిస్తుందని చెప్పొచ్చు. పెళ్లి తర్వాత రన్ వీర్ నుండి వస్తున్న మొదటి సినిమా ఇదే.. ఇక ఎన్.టి.ఆర్ టెంపర్ సినిమాను తమిళంలో కూడా రిలీజ్ చేస్తున్నారు. విశాల్ హీరోగా అయోగ్య పేరుతో అక్కడ రీమేక్ అవుతుంది. విశాల్ టెంపర్ కు సంబందించిన పోస్టర్ కొద్ది రోజుల క్రితం రిలీజై మంచి క్రేజ్ తెచ్చుకుంది. మరి తెలుగులో సాధించినట్టుగా తమిళ, హింది భాషల్లో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news