శ్రీనివాస కళ్యాణం ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. డిజాస్టర్ కన్ఫం..

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన లేటెస్ట్ ఫ్యామిలి ఎంటర్‌టైనర్ ‘శ్రీనివాస కళ్యాణం’ ఇటీవల విడుదలై మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో సైతం అదిరిపోయే బజ్ క్రియేట్ కావడంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని ఆతృతగా ఎదురుచూసారు జనాలు.

కట్ చేస్తే.. సినిమా రిలీజ్ రోజున అన్ని వర్గాల ప్రేక్షకులను ముఖ్యంగా యూత్, మాస్ వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఈ సినిమాలో లేకపోవడంతో వారు దీనికి కనెక్ట్ కాలేకపోయారు. దీంతో ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. ఈ చిత్రం రూ. 27 కోట్ల భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్ చేయగా ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే ఈ సినిమా మరో డిజాస్టర్‌గా నిలవనుంది. ఈ సినిమా మొదటి వారం పూర్తయ్యే సరికి ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 11.83 కోట్లు మాత్రమే రాబట్టింది.

నితిన్, రాశి ఖన్నాలు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో భారీ తారాగాణం ఉన్నా జనాలను అలరించడం ఫెయిల్ అయ్యింది. ఇక ఈ చిత్ర ఫస్ట్ వీక్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – ఫస్ట్ వీక్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 4.75
సీడెడ్ – 1.42
నెల్లూరు – 0.32
కృష్ణా – 0.61
గుంటూరు – 0.75
వైజాగ్ – 1.30
ఈస్ట్ – 0.72
వెస్ట్ – 0.46
టోటల్ ఏపీ+తెలంగాణ – 10.33
ఓవర్సీస్ – 0.80
రెస్టాఫ్ ఇండియా – 0.70
టోటల్ వరల్డ్ వైడ్ – 11.83 కోట్లు

Leave a comment