Gossipsరాజమౌళి తిరస్కరణలో సైరా.. అసలేం జరిగింది..!

రాజమౌళి తిరస్కరణలో సైరా.. అసలేం జరిగింది..!

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా వస్తున్న సైరా నరసింహా రెడ్డి టీజర్ మంగళవారం రిలీజ్ అయ్యి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ లో చిరు లుక్ మెగా ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. అయినా సరే ఈ సినిమాకు దర్శకుడిగా రాజమౌళిని ఎందుకు తీసుకోలేదు అన్న టాక్ వస్తుంది.

బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచదేశాలకు చాటి చెప్పిన ఘనత రాజమౌళిది. అయితే ఈ సినిమాలో రాజమౌళి దర్శకత్వ ప్రతిభ అందరిని శభాష్ అనేలా చేసింది. అయితే సైరా సినిమాకు సూరి బాగా వర్క్ అవుట్ చేస్తున్నా రాజమౌళి అయ్యుంటే బాగుంటుందని టాక్. లేటెస్ట్ ఫిల్మ్ నగర్ న్యూస్ ఏంటంటే సైరా సినిమా చేయాలని ముందు రాజమౌళినే అడిగాడట రాం చరణ్. కాని రాజమౌళి అందుకు ఒప్పుకోలేదట. తనతో సినిమా టైం పడుతుందని సున్నితంగా సినిమా వద్దన్నాడట.

అయితే సినిమా చేయనని చెప్పినా రాజమౌళి పర్యవేక్షణలో సైరా సినిమా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ భారీగా పెట్టేస్తున్నారు. ఇన్నాళ్లు కమర్షియల్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి ఈ సినిమాను ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news