Gossipsరోడ్డు మీద కూరగాయలు అమ్ముతున్ననితిన్ హీరోయిన్..!

రోడ్డు మీద కూరగాయలు అమ్ముతున్ననితిన్ హీరోయిన్..!

బాలీవుడ్ నుండి పూరి డైరక్షన్ లో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అదా శర్మ ఆ సినిమాతో యూత్ ను అలరించినా ఆ తర్వాత ఎందుకో ఆకట్టుకోలేదు. అమ్మడిలో స్టార్ రేంజ్ కు ఎదిగే క్వాలిటీస్ ఉన్నా టైం ఏమాత్రం కలిసి రాలేదు. ప్రస్తుతం ఫోటో షూట్స్ తోనే సరిపెట్టుకుంటున్న ఈ అమ్మడు లేటెస్ట్ గా రోడ్డు మీద కూరగాయలు అమ్ముతూ కనిపించింది. హీరోయిన్ గా ఓ మోస్తారు క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ మరి ఇంత దిగజారడం ఏంటని అవాక్కవ్వొచ్చు. కాని అది కూడా ఓ సినిమా కోసమే అని తెలుస్తుంది.

టాలీవుడ్, బాలీవుడ్ కాదు ఏకంగా హాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన అదా శర్మ ఆ సినిమలో డీ గ్లామరస్ రోల్ చేస్తుందట. దానికి ట్రైల్ గా ఫోటో షూట్ కోసం కూరగాయలు అమ్మే దానిగా స్టిల్స్ ఇచ్చింది. అటు ఇటుగా ఎంచుకున్న పాత్రకి న్యాయం చేసేలా అమ్మడి ప్రయత్నాలు ఉన్నాయని చెప్పొచ్చు. నితిన్ తో హార్ట్ ఎటాక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అదా శర్మ ఇలా కూరగాయలు అమ్ముకోవడం చూస్తే ఆమె అభిమానులు ఫీల్ అవుతున్నారు.
0

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news