Moviesటాలీవుడ్ లో ఫ్లపైన బాలీవుడ్ లో దంచికొట్టిన బాలయ్య

టాలీవుడ్ లో ఫ్లపైన బాలీవుడ్ లో దంచికొట్టిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ క్రేజ్ నేషనల్ వైడ్ గా ఉంది అని చెప్పొచ్చు. కేవలం తెలుగు సినిమాలే చేసే బాలకృష్ణ సౌత్ వరకు ఓకే కాని నేషనల్ వైడ్ గా ఎలా అంటారా ఈమధ్యనే సోనీ మ్యాక్స్ లో ఆయన నటించిన పైసా వసూల్ హింది డబ్బింగ్ వర్షన్ టెలికాస్ట్ అయ్యింది. ఆ సినిమా టి.ఆరి.పి రేటింగ్స్ లో అదరగొట్టింది.

ఆ వారం టెలికాస్ట్ అయిన సినిమాల్లో అత్యధిక టి.ఆర్.పి రేటింగ్ తెచ్చుకున్న సినిమాగా టాప్ 5గా నిలిచింది పైసా వసూల్. పూరి జగన్నాథ్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ పై పెద్దగా వసూళ్లను రాబట్టలేదు. అయితే ఈమధ్య తెలుగు సినిమాలు బుల్లితెర మీద అది కూడా హిందిలో ఎక్కువ డిమాండ్ ఏర్పడేలా చేసుకున్నాయి. బాలయ్య క్రేజ్ ఈ రేంజ్ లో ఉంది అంటే ప్రస్తుతం చేస్తున్న ఎన్.టి.ఆర్ సినిమాను బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు.

#NBK101 #PaisaVasool Hindi DUBBING Urban Telecast Made into Top5 Hindi
Movie’s of the week ( aug 11-17 2018)👌

111

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news