గాయపడిన ప్రత్యర్థి ఆటగాడిని ఎత్తుకుని…ఇరాన్ ఆటగాడు మనసులు గెలిచాడు..

ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భాగంగా జరిగిన ఓ అద్భుత సంఘటన ప్రేక్షకుల మనసు మెప్పించింది. ఇరాన్ ఆటగాడు చేసిన సహాయానికి అందరు ఫిదా అవుతున్నారు. ఆసియా క్రీడల్లో భాగంగా ఇరాన్ ఆటగాడు ఇర్ఫాన్, భారత క్రీడాకారుడు సూర్య ప్రతాప్ 60 కేజీల విభాగంలో పాల్గొన్నారు.

సెమీ ఫైనల్ మ్యాచ్ కావడంతో ఇద్దరు గట్టి గురితో ఉన్నారు. అయితే ఆట మధ్యలోనే సూర్య ప్రతాప్ కాలికి గాయం అవడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. కనీసం నిలబడే ఓపిక లేకపోవడం గమనించిన ఇర్ఫాన్ విజేత తానే అని ప్రకటించిన అనంతరం సూర్య ప్రతాప్ ను ఎత్తుకుని మరి అతని కోచ్ దగ్గరకు తీసుకెళ్లాడు. సెమీ ఫైనల్స్ లో విజేతగా నిలవడమే కాదు కోట్ల మంది అభిమానుల మనసులను గెలిచాడు ఇర్ఫాన్.

Leave a comment