Newsహిందూ ఆలయంలో ముస్లిం ప్రార్థనలు..కేరళలో అరుదైన సంఘటన..!

హిందూ ఆలయంలో ముస్లిం ప్రార్థనలు..కేరళలో అరుదైన సంఘటన..!

కేరళ వరద బీభత్సానికి అక్కడ ప్రజల పరిస్థితి ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరద నీటితో అక్కడ జనాలు నానా ఇక్కట్లు పడుతున్నారు. అయితే ఇప్పటికే కేరళ వరద బాధితులకు సహాయక చర్యలు చేపడుతున్నా ఆ నష్టాన్ని పూరించాలంటే అందరం తలా ఒక చేయాల్సిందే అని మన పర బేధాలు లేకుండా ముందుకు కదులుతున్నారు. ఇక మరో పక్క ఈ వరదల వల్ల మత సామరస్యానికి కొత్త అర్ధం చెప్పిందని ఓ సంఘటన తెలియచేసింది.

ముసలమాన్ లు సాక్రిఫైజ్ డే గా కొలుకుచునే బ్రక్రీద్ రోజూ కేరళ వరద ప్రాంతంలో మసీదులు ఏవి లేకపోవడం వల్ల ఓ దేవాలయంలో వారి నమాజ్ చేసుకున్నారు. త్రిస్సుర్ లోని పురప్పిల్లికవు రక్తేశ్వరి టెంపుల్ లో ముస్లీం సోదరులు నమాజ్ చేశారు. ముస్లీం సోదరుల అభ్యర్ధనను ఆహ్వానించి దేవాలయంలో నమాజ్ చేసేందుకు వీలు కల్పించారు. ఈ అరుదైన సంఘటన మత సామరస్వాన్ని పెంపొందిస్తుంది.

కేరళలో జరిగిన ఈ అరుదైన సంఘటన ప్రజల మనసులను మెప్పించింది. ఇప్పుడిప్పుడే వరదల నుండి కేరళ కోలుకుంటుంది. అయితే నష్ట నివారణ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news