Gossips"అరవింద సమేత" లో అది వద్దంటే వద్దని చెప్పేసిన ఎన్టీఆర్..!

“అరవింద సమేత” లో అది వద్దంటే వద్దని చెప్పేసిన ఎన్టీఆర్..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా అరవింద సమేత. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా ఎమోషనల్ గా నడుస్తున్నా మధ్యలో వచ్చే ఫైట్ సీన్స్ మాత్రం అదిరిపోతాయట. ఇవి చాలా స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.

అయితే ఎన్.టి.ఆర్ కోసం ఓ స్పెషల్ ఫైట్ అనుకున్నారట. అత్తారింటికి దారేది సినిమాలో కళ్లజోడు ఫైట్ మాదిరిగా ఈ ఫైట్ ఉంటుందట. సినిమాలో ఆ ఫైట్ హిట్ అవుతుందని తెలిసినా ఆ ఫైట్ చూస్తే అత్తారింటికి దారేది ఫైట్ సీన్ గుర్తొస్తుందని అది వద్దనేశాడట తారక్. దాని బదులు వేరే ఫైట్ పెట్టమన్నారట.

ఫస్ట్ లుక్ తోనే సిక్స్ ప్యాక్ చూపించిన తారక్ ఈ సినిమాతో చాన్నాళ్ల తర్వాత పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడట. దసరా బరిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news