Newsకెటీఆర్ కు ఛాలెంజ్ విసిరిన రాం చరణ్..సోషల్ మీడియాలో లొల్లి లొల్లి...

కెటీఆర్ కు ఛాలెంజ్ విసిరిన రాం చరణ్..సోషల్ మీడియాలో లొల్లి లొల్లి !

హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్ అనే ఛాలెంజ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతుంది. కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ మొదలుపెట్టిన ఈ ఛాలెంజ్ ను అటు స్పోర్ట్స్ పర్సన్స్ నుండి పొలిటిషియన్స్ ద్వారా సెలబ్రిటీస్ దగ్గరకు వచ్చింది. ఇప్పటికే అఖిల్, నాగార్జునకు ఈ ఛాలెంజ్ చేయగా మోహన్ లాల్ ఛాలెంజ్ ను స్వీకరించిన ఎన్.టి.ఆర్, మహేష్, రాం చరణ్ లకు ఛాలెంజ్ చేశాడు.

ఇక మహేష్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు కాని ఎన్.టి.ఆర్ ఛాలెంజ్ ను స్వీకరించిన చరణ్ బాక్సింగ్ వర్క్ అవుట్స్ చేస్తూ వీడియో పెట్టాడు. ఇక చరణ్ కూడా తెలంగాణా మంత్రి కె.టి.ఆర్ కు ఛాలెంజ్ విసిరాడు. ఆయనతో పాటుగా మెగాస్టార్ చిరంజీవి, వరుణ్ తేజ్, సుకుమార్, అబు జాని, సందీప్ కోస్లా, శోభన కామినేనిలకు ఈ ఛాలెంజ్ పాస్ చేశాడు.

టాలీవుడ్ స్టార్స్ తో ఎంతో చనువుగా ఉండే కెటీఆర్.. రాం చరణ్ ఛాలెంజ్ ను ఎలా స్వీకరిస్తాడో చూడాలి. చిరు కూడా ఎలాంటి వర్క్ అవుట్ తో కనిపిస్తాడో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news