తేజ్ (I Love You) రొమాంటిక్ వీడియో

యువ కథానాయకుడు, మెగా మేనల్లుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైనా హీరో సాయి ధరమ్. ఇండస్ట్రీ కి వచ్చిన అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యకమైన గుర్తింపు సంపాదించుకున్నారు.
పిల్ల నువ్వు లేని జీవితం,సుప్రీమ్, సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నారు.
అయితే గత కొంత కాలంగా సరైన హిట్ ఇవ్వలేకపోయారు సాయి ధరమ్ తేజ్.

అయితే తాజాగా ఎన్నో ప్రేమ కథ చిత్రాలు అందించిన దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వంలో
“తేజ్” I LOVE U అనే సినిమాలో నటించారు సాయి ధరమ్. అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో హీరోయిన్ గ నటించారు. నూతన సంగీత దర్శకుడు గోపి సుందర్ ఈ సినిమాకి స్వరాలూ అందించారు. ప్రముఖ నిర్మాత కే ఎస్ రామ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 14వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకు వచ్చే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందని సమాచారం.

Leave a comment