సీఎం అవుతాను .. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను : పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాగిస్తున్న పోరాట యాత్ర సక్సెస్ ఫుల్ గా సాగుతుందని చెప్పొచ్చు. 2019 ఎన్నికల్లో తన మార్క్ చూపించేందుకు సిద్ధమైన జనసేనాని ప్రజల సమస్యలపై పోరాడేందుకు సిద్ధమయ్యారు. ఇక ప్రజలు తనకు అవకాశం ఇస్తే తాను సిఎం అవుతానని.. బాధ్యతాయుతంగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని అన్నారు పవన్ కళ్యాణ్.

గంగవరం పోర్ట్ నివాసితులతో పాట్లాడిన పవన్ కళ్యాణ్ అక్కడ స్పీచ్ లో ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వాల మీద విమర్శలు చేశారు. ప్రజల సంక్షేమం కోసం కాకుండా నేతల స్వార్ధం కోసం, కుటుంబాల కోసం పనిచేస్తున్నాయని ఎద్దేవా చేశారు. రాజకీయ నాయకుల్లో జవాబుదారి తనం ఉండాలని చెప్పారు.

ఇక పవన్ మాట్లాడుతున్న సమయంలో సిఎం సిఎం అంటూ అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కేకలు వేశారు. మీరు సిఎం సిఎం అన్న మాత్రనా సిఎం కానని ప్రజల సమస్యలను అర్ధం చేసుకున్నాకే సిఎం అవుతానని అన్నారు పవన్ కళ్యాణ్. జై ఆంధ్రాలో ప్రాణ త్యాగం చేసిన అమరవీరులకు నివాళులు అర్పించి పవన్ పోరాట యాత్ర ప్రారంభించారు. 45 రోజుల పాటు ఆంధ్ర ప్రదేశ్ మొత్తం ఈ యాత్ర సాగుతుంది.

Leave a comment