Moviesమహేష్ బాబు రాజసం .. టైటిల్ తోనే బ్లాక్ బస్టర్ సౌండింగ్..!

మహేష్ బాబు రాజసం .. టైటిల్ తోనే బ్లాక్ బస్టర్ సౌండింగ్..!

సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుంది. అశ్వనిదత్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా రాజసం అని పెట్టబోతున్నారట. అసలకే ఈ సినిమాలో మహేస్ రఫ్ లుక్ లో కనిపిస్తాడని తెలుస్తుండగా దానికి తగినట్టుగా రాజసం అన్న టైటిల్ పెడితే మాత్రం ఇక సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని అంటున్నారు.

ఈమధ్యనే భరత్ అనే నేను సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ ఇక నుండి సినిమా కథల విషయంలో ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేసే అంశాలు ఉన్నాయా లేదా అన్న కోణంలోనే చూస్తున్నాడట. వంశీ పైడిపల్లి సినిమా ఫ్యాన్స్ కు పండుగ చేసుకునేలా ఉండటం ఖాయమని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత మహేష్ సుకుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఆ సినిమా థ్రిల్లింగ్ కథాంశంతో వస్తుందట. మొత్తానికి భరత్ తో ట్రాక్ ఎక్కిన మహేష్ రాజసం చూపించేందుకు రెడీ అవుతున్నాడన్నమాట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news