Gossipsనేను అలా మారడానికి కారణం వర్మనే..!

నేను అలా మారడానికి కారణం వర్మనే..!

సంచలన దర్శకుడు ఆర్జివి ప్రపంచానికి ఎలా తెలుసు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాని తన దగ్గర పనిచేసిన వారికి మాత్రం మంచి స్పూర్తిదాత వర్మ. అదే విషయాన్ని మరోసారి చెబుతుంది రాజుగాడు దర్శకురాలు సంజనా రెడ్డి. శ్రీకాకులం జిల్లా టెక్కలి నుండి వచ్చిన తను ఓ స్నేహితుడి సహాయంతో వర్మ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యానని.. మోహన్ బాబుతో చేసిన రౌడి సినిమాకు వర్మ దగ్గర పనిచేయడం జరిగిందని అన్నారు సంజనా రెడ్డి.

ఇక వర్మ దగ్గర చేయడం వల్ల చాలా విషయాలు తెలుసుకున్నానని.. దర్శకురాలిని కావాలన్న కల బలంగా మార్చేలా చేశారు వర్మ అని చెప్పుకొచ్చారు సంజనా రెడ్డి. ఇక ఆ ప్రయత్నంలోనే రాజ్ తరుణ్ తో పరిచయం ఏర్పడటం.. నిర్మాతలు కలవడం ఈ సినిమా తెరకెక్కిందని చెప్పారు.

కుటుంబ సమేతంగా చూసి ఆనందించదగిన సినిమా రాజుగాడు అని.. ఎంటర్టైనింగ్ గా ఉంటుందని చెప్పారు. అసలే కెరియర్ అటు ఇటుగా ఉన్న రాజ్ తరుణ్ రాజుగాడు మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. మరి సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news