Gossipsరేప్ చేస్తాం అంటూ.. బన్ని ఫ్యాన్స్ ఆ రివ్యూయర్ ను బెదిరించారట..!

రేప్ చేస్తాం అంటూ.. బన్ని ఫ్యాన్స్ ఆ రివ్యూయర్ ను బెదిరించారట..!

టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ హంగామా ఏమో కాని కేరళలో మాత్రం బన్ని ఫ్యాన్స్ వీరంగానికి అడ్డు అధుపు లేకుండా పోయింది. తన ప్రతి సినిమా మళయాలంలో డబ్బింగ్ చేస్తూ రిలీజ్ చేస్తున్న బన్ని అక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. ఇక్కడ రిజల్ట్ ఎలా ఉన్నా బన్ని సినిమా అక్కడ మాత్రం బీభత్సంగా ఆడేస్తుంటాయి.

ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన బన్ని సినిమా నా పేరు సూర్య తెలుగులో ఫ్లాప్ అవగా అక్కడ పర్వాలేదు అనిపించుకుంది. అయితే ఈ సినిమా చూసి నెగటివ్ రివ్యూ ఇచ్చిన అపర్ణ ప్రశాంతికి బన్ని ఫ్యాన్స్ నుండి బెదిరింపులు ఎక్కువయాయి. సినిమా గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పిన అపర్ణ ప్రశాంతికి కేరళ బన్ని ఫ్యాన్స్ ఆమెను రేప్ చేస్తాం.. చంపేస్తాం అంటూ బెదిరిస్తున్నారట.

తెలుగు ఫ్యాన్స్ అలా అన్నారంటే ఒక అర్ధం ఉంది కేరళలో బన్నికి ఈ రేంజ్ ఫాలోయింగ్ అంటే మాములు విషయం కాదు. అక్కడ స్ట్రైట్ హీరోల మాదిరి బన్ని సినిమాలు ఆడుతుంటాయి.. అయితే బన్ని ఫ్యాన్స్ చేస్తున్న ఈ న్యూసెన్స్ కు అపర్ణ ప్రశాంతి మళప్పురం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. మరి ఈ విషయంలో బన్ని ఫ్యాన్స్ కు ఏదైనా మెసేజ్ పాస్ చేస్తాడా లేక మనకెందుకులే అన్నట్టు ఉంటాడా అన్నది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news