NewsRRR కు ముందే TTT.. ఎన్టీఆర్ పేరుతో ఏంటో ఈ మ్యాజిక్..!

RRR కు ముందే TTT.. ఎన్టీఆర్ పేరుతో ఏంటో ఈ మ్యాజిక్..!

రాజమౌళి మెగా నందమూరి మల్టీస్టారర్ గా ఈమధ్యనే ఒకడుగు ముందుకేసిన సంగతి తెలిసిందే. ట్రిపుల్ R అంటూ ఓ సరికొత్త సంచలనం సృష్టించాడు రాజమౌళి. రాం చరణ్, రాజమౌళి, రామారావు ఇలా ముగ్గురి పేర్లు కలిసి వచ్చేలా సెట్ చేశాడు. ఇక ఇప్పుడు ఇదే సెంటిమెంట్ ను TTT అని త్రివిక్రం సినిమాకు వాడేస్తున్నారు.

RRR అంటే అర్ధం తెలుసు మరి త్రివిక్రం సినిమాకు ట్రిపుల్ T ఎలా అంటే. త్రివిక్రం, తారక్, తమన్ అని అంటున్నారు. ఎన్టీఆర్ ను ఇండస్ట్రీలో అందరు తారక్ అనే పిలుస్తారు. అందుకే త్రివిక్రం సినిమా TTT గా ప్రమోట్ చేస్తున్నారు. సినిమాకు నిన్నటి నుండి తమన్ మ్యూజిక్ కంపోజ్ మొదలుపెట్టాడు. ఆ విషయం వెళ్లడిస్తూ ఈ ట్రిపుల్ T కాన్సెప్ట్ చెప్పి ట్రెండ్ చేయాలని చూస్తున్నాడు. మరి #RRR లానే #TTT కూడా సంచలనంగా మారుతుందా లేదా అన్నది చూడాలి.

ఈ సినిమా త్వరగా పూర్తి చేసి ఎలాగైనా సరే అక్టోబర్ కల్లా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అదే నెల నుండి ఎన్.టి.ఆర్ రాజమౌళి సినిమాకు పనిచేయాల్సి ఉంది. ఎన్.టి.ఆర్ తో పాటుగా రాం చరణ్ కూడా జక్కన్న సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news