Gossipsఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్ !!

ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్ !!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ వచ్చి అప్పుడే ఐదు నెలలు అవుతుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించే చిత్రం ముహూర్తం షాట్ ఎప్పుడో నవంబర్ లో జరుపుకొంది. అప్పటినుండి ఇదుగో అదుగో అంటూ వార్తలైతే వచ్చాయి కానీ సినిమా మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు.అయితే ఇప్పుడు మనకందుతున్న అఫీషియల్ సమాచారం ప్రకారం మార్చ్ 23 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకొని జూన్ వరకు ఈ సినిమా పూర్తి అవుతుందని సమాచారం.

గత సంవత్సరం దీపావళి కి వచ్చి థియేటర్లలో సందడి చేసిన ఎన్టీఆర్ ఈ సారి మాత్రం దసరాకి వస్తాడని సమాచారం. ఇక ఈ సినిమాలో సంగీత దర్శకుడు కూడా తమన్ ని తీసుకుంటున్నారని సమాచారం. హీరోయిన్ల విషయం కూడా ఇంకా తేలాల్సి ఉంది. అజ్ఞాతవాసి భారీ అపజయం తర్వాత వస్తున్న సినిమా కావడంతో త్రివిక్రమ్ స్క్రిప్ట్ పై మరింత కఠినంగా పని చేస్తున్నాడని , ఎన్టీఆర్ కూడా పాత్రకు తగ్గ రూపం కోసం కసరత్తులు చేస్తున్నాడని సమాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news