Gossipsరాజమౌళి ఎదురు చూపు దానికోసమేనా ..?

రాజమౌళి ఎదురు చూపు దానికోసమేనా ..?

తెలుగు సినిమా స‌త్తాని వినువీధుల చాటిన ద‌ర్శ‌కుడిగా జ‌క్క‌న్న‌కి పేరుంది. బాహుబ‌లి సిరీస్‌తో ఊహించ‌నంత ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఆయ‌న కొద్ది రోజులుగా సినిమాల‌కు దూరంగా ఉంటున్నారు. బాహుబ‌లి సిరీస్ స‌క్సెస్ త‌రువాత ఏ సినిమానీ ఎనౌన్స్ చేయ‌లేదాయ‌న‌.వ‌రుస సినిమా ఫంక్ష‌న్ల‌లో మెరుస్తూ తోటి ద‌ర్శ‌కుల‌ను ఉత్సాహ‌ప‌రుస్తున్నారే త‌ప్ప ఆయ‌న సినిమా కెరియ‌ర్ గురించి ఏమీ మాట్లాడ‌డం లేదు.

 

ఆమధ్య చ‌ర‌ణ్ తో ఓ సినిమా చేస్తాడ‌ని టాక్ వ‌చ్చినా అది నిజ‌మో కాదోతెలియ‌దు. మ‌రోవైపు మ‌హేశ్ తో సినిమా చేస్తాడ‌ని తెలిసినా అది కూడా క‌న్ఫం కాలేదు.నిర్మాతలు ఖరారయ్యారు కానీ… సినిమా ఎవరితో? ఎప్పుడనే విషయాల్లో మాత్రం స్పష్టత లేదు. చిత్ర పరిశ్రమల్లో ప్రచారాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. మరోవైపు బాలీవుడ్‌ ప్రాజెక్ట్ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.ఏదేమైనా వ‌చ్చే ఏడాది ఆరంభంలోనే రాజ‌మౌళి త‌దుప‌రి సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news