Moviesఆ అమ్మడికి లక్కీ ఛాన్స్.. బాలయ్యతో జోడి కట్టేస్తుంది..!

ఆ అమ్మడికి లక్కీ ఛాన్స్.. బాలయ్యతో జోడి కట్టేస్తుంది..!

ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న నందమూరి నట సింహం ఈమధ్యనే పైసా వసూల్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూరి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అవగా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ కలక్షన్స్ తో దూసుకెళ్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ఏమాత్రం గ్యాప్ లేకుండానే తన 102వ సినిమా మొదలు పెట్టాడు బాలయ్య బాబు.

కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార ఇప్పటికే షూటింగ్ లో పాల్గొంటుండగా ఇంకో ఇద్దరు హీరోయిన్స్ కు ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇక అందులో మొదటి అవకాశాన్ని నటాషా దోషి దక్కించుకుందని ఫిలిం నగర్ టాక్.

మలయాళంలో హైడ్ అండ్ సీక్, నయన, కాల్ మీ @ వంటి సినిమాల్లో నటించిన నటాషా బాలయ్య సరసన లక్కీ ఛాన్స్ దక్కించుకుంది. తెలుగు తెర మీద మలయాళ ముద్దుగుమ్మల హవా తెలిసిందే. ఇక బాలయ్య సినిమాతో ఎంట్రీ ఇస్తున్న నటాషా దోషి ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news