Newsప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తున ఉండే ప‌ర్వ‌త శిఖ‌రంపై కేసీఆర్ చిత్ర‌ప‌టం.. పూర్తి...

ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తున ఉండే ప‌ర్వ‌త శిఖ‌రంపై కేసీఆర్ చిత్ర‌ప‌టం.. పూర్తి వివరాలు

ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తున ఉండే ద‌క్షిణాఫ్రికా టాంజానియాలోని కిలీ మంజారో ప‌ర్వ‌త శిఖ‌రంపై ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు చిత్ర‌ప‌టాన్ని ఎగుర వేశారు బీసీ సంక్షేమ శాఖ కాలేజీ హాస్ట‌ల్ విద్యార్థి పీ.చ‌ర‌ణ్‌రాజ్‌. సికింద్రాబాద్‌లోని బీసీ కాలేజీ హాస్ట‌ల్‌లో ఉండి బీఎస్సీ రెండ‌వ సంవ‌త్స‌రం చ‌దువుకుంటున్న చ‌ర‌ణ్‌రాజ్ కు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి అశోక్‌కుమార్ ప్రొత్స‌హించి కిలీ మంజారో ప‌ర్వ‌తారోహ‌ణ‌కు పంపారు.

భూమికి దాదాపుగా 20వేల అడుగుల ఎత్తున ఉండే కిలీ మంజారో ప‌ర్వ‌త శిఖ‌రాన్ని అధిరోహించిన చ‌ర‌ణ్‌రాజ్ ఆ శిఖ‌రంపై సీఎం కేసీఆర్‌తోపాటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామ‌న్న‌తో కూడిన చిత్ర‌ప‌టాన్ని ఎగుర‌వేశారు. చ‌ర‌ణ్‌రాజ్ సాహ‌సాన్ని మంత్రి జోగు రామ‌న్న‌, ముఖ్య కార్య‌ద‌ర్శి అశోక్‌కుమార్‌, బీసీ సంక్షేమ శాఖ క‌మిష‌న‌ర్ శ్రీ‌నివాస్‌, అద‌న‌పు సంచాల‌కుడు కిరాడ్ అలోక్‌కుమార్‌, త‌దిత‌రులు అభినందించారు. తెలంగాణ ఖ్యాతిని ఖండాంత‌రాలు వ్యాపింప‌చేసిన చ‌ర‌ణ్‌రాజ్ అభినంద‌నీయుడ‌ని వారు కొనియాడారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news