Moviesఅమ్మడి అందాలకు ఫిదా...ఐటం సాంగ్ లో కేథరిన్ అదుర్స్...

అమ్మడి అందాలకు ఫిదా…ఐటం సాంగ్ లో కేథరిన్ అదుర్స్…

ఇద్దరమ్మాయిలతో’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది దుబాయి బ్యూటీ కేథరిన్ త్రెసా. ఈ సినిమాలో గ్లామరస్‌గా కనిపించి యూత్‌ను మెప్పించింది. ఆ తరువాత ‘సరైనోడు’ సినిమాలో యువ ఎమ్మెల్మేగా.. చీరకట్టులో కనిపించి ఆశ్చర్యపరిచింది. చిరు 150వ సినిమాలో కేథరిన్ ఐటెమ్ సాంగ్ చేయాలి కానీ లారెన్స్‌తో విబేధాల కారణంగా బయటకు వచ్చేసింది. దీంతో ఇక అమ్మడు కెరీర్ అయిపోయిందనే కామెంట్స్ వినిపించాయి. కానీ కేథరిన్ కు అవకాశాలు రావడం మానలేదు. ‘గౌతమ్ నంద’ సినిమాలో బికినీలో కనిపించి అందరినీ ఎంటర్టైన్ చేయగా.. ఇప్పుడు ఐటెమ్ సాంగ్‌లో తళుక్కున మెరిసి మరోసారి యూత్‌ను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది.

బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తోన్న ‘జయ జానకి నాయక’ సినిమాలో కేథరిన్ ఓ ఐటెమ్ సాంగ్‌లో నటించింది. ఇటీవల విడుదలైన ‘జయజానకి నాయక’ థియేట్రికల్ ట్రైలర్‌లో కేథరిన్ ఐటమ్ సాంగ్ వీడియో క్లిప్‌‌పై ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తుంది. ఈ పాటలో కేథరిన్ ధరించిన దుస్తులు, ఆమె డాన్సులు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కొందరు కేథరిన్ మరీ ఇలా రెచ్చిపోయిందేంటి..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదైతేనేం మాస్ బీట్ సాంగ్‌లో కేథరిన్ పెర్ఫార్మన్స్‌కు మంచి మార్కులైతే పడుతున్నాయి. అయితే భవిష్యత్తులో ఆమె ఐటెమ్ సాంగ్స్ లో నటిస్తుందా..? అనేది అనుమానమే. ఎందుకంటే గతంలో బోయపాటి కోసం మాత్రమే ఐటెమ్ సాంగ్ చేస్తున్నానని.. ఐటెమ్ సాంగ్స్‌లో నటించే ఆసక్తి తనకు లేదని స్పష్టం చేసింది ఈ లేటెస్ట్ ఐటమ్ బ్యూటీ.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news