Moviesబన్నీ నిర్ణయంతో .."నా పేరు సూర్య" సంచలన రికార్డు...?

బన్నీ నిర్ణయంతో ..”నా పేరు సూర్య” సంచలన రికార్డు…?

స్టైలిష్ స్టార్ అర్ల్లు అర్జున్ వక్కంతం వంశీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘నా పేరు సూర్య’. లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా బ్రదర్ నాగ బాబు కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రీసెంట్ గా ముహుర్తం పెట్టుకున్న ఈ మూవీ ఆగష్టు 1నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసింది. ఈ క్రమంలో ఆగష్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుండి స్పెషల్ గిఫ్ట్ అందిస్తున్నారట. సినిమాలో ఆర్మీ సోల్జర్ గా కనిపించబోతున్న బన్ని ఇండిపెండెన్స్ డే కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడట.

అయితే మొదలైంది 1వ తారీఖే 15 రోజుల్లోనే బన్ని సంచలనం అంటే మాములు విషయం కాదు. సినిమాకు సంబందించిన టీజర్ కాని, సాంగ్ కాని, పోస్టర్ కాని రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. విశాల్ శేఖర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో అను ఎమాన్యుయెల్ హీరోయిన్ గా చేస్తుంది. మరి ముహుర్తం పెట్టిన నాటి నుండే రికార్డ్ రేసులో ఉన్న బన్ని సినిమా పూర్తయ్యాక ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news