Moviesముందు అక్క ...ఇప్పుడు తమ్ముడు..

ముందు అక్క …ఇప్పుడు తమ్ముడు..

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అగ్ర కథానాయికల్లో ఒకరు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్ గా చిత్రసీమలో అడుగుపెట్టిన మొదటి సినిమా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ ఆ సినిమాతో మంచి గుర్తింపు పొందిన ఈమె ఇప్పుడు ఒక సంచల నిర్ణయంతో తెలుగు సినీ జనానికి షాక్ ఇవ్వబోతుంది.

ఆమె చిన్న తమ్ముడు అమన్‌ ప్రీత్‌ సింగ్‌ని నటుడిగా పరిచయం చేయబోతున్నారు. అమన్‌ కీలక పాత్రలో ఓ లఘు చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీలుక్‌ను సోమవారం విడుదల చేశారు. దీన్ని రకుల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

‘తమ్ముడూ నీ మొదటి లఘు చిత్రానికి ఆల్‌ ద బెస్ట్‌…ఇది ఆరంభం మాత్రమే’ అని రకుల్‌ పోస్ట్‌ చేశారు. ఈ లఘు చిత్రానికి ‘రాక్‌ అండ్‌ రోల్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. త్వరలో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నట్లు ప్రచార చిత్రంలో పేర్కొన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news